Surya Retro Movie : మన టాలీవుడ్ లో మంచి క్రేజ్, మార్కెట్ ని సంపాదించుకున్న హీరోలలో ఒకరు సూర్య(Suriya Sivakumar). ‘గజినీ’ చిత్రంతో తెలుగునాట సెన్సేషన్ ని సృష్టించిన సూర్య, ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో తనకంటూ తిరుగులేని ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకానొక దశలో సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) కి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీని ఇచ్చే ఏకైక హీరోగా సూర్య తన మార్కెట్ పరిధి ని పెంచుకున్నాడు. కానీ చాలా కాలం నుండి ఆయన సరైన సూపర్ హిట్ లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘కంగువా’ చిత్రం కూడా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఒకప్పుడు తమిళం లో పెద్దగా విజయం సాధించని సూర్య సినిమాలు కూడా తెలుగు లో విడుదలై సూపర్ హిట్స్ అయ్యాయి. కానీ ఇప్పుడు తెలుగు లో కూడా ఆయనకు వరుసగా పరాజయాలు ఎదురు అవుతున్నాయి.
Also Read : విశ్వంభర రిలీజ్ మీద వీడని సస్పెన్స్…అనుకున్న టైమ్ కి వస్తుందా..? అసలు ఆలస్యానికి కారణం ఎవరు..?
నిన్న గాక మొన్న వచ్చిన హీరోలు కూడా సూర్య మార్కెట్ ని దాటేస్తున్నారు. భారీ బ్లాక్ బస్టర్స్ ని అందుకోని సూర్య ని దాటేస్తున్నారు. కానీ సూర్య మాత్రం సరైన బ్లాక్ బస్టర్ ని అందించలేకపోతున్నాడు. అందుకే ఆయన తెలుగు డైరెక్టర్స్ ని నమ్ముకున్నాడు. ఆయన తదుపరి చిత్రాలన్నీ టాలీవుడ్ డైరెక్టర్స్ తోనే అవ్వడం గమనార్హం. అంతకు ముందే ఆయన కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘రెట్రో'(Retro Movie) అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. మూవీ టీం విడుదల చేసిన టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం లో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించింది. ఆమెకు కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఎంతో అవసరం. సూర్య అగ్రెసివ్ లుక్స్ ఆడియన్స్ లో ప్రత్యేకమైన ఆసక్తిని రేపింది.
అందుకే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. సూర్య కి గతంలో వరుసగా ఫ్లాప్స్ ఉన్నప్పటికీ కూడా, ఈ చిత్రానికి ఇంత బిజినెస్ జరిగిందంటే, అందుకు కారణం ఆయనకు ఉన్న క్రేజ్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా హిట్ అయితే కచ్చితంగా సూర్య కి మళ్ళీ తన వింటేజ్ సౌత్ ఇండియన్ మార్కెట్ తిరిగి వచ్చినట్టే. ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే 1వ తారీఖున విడుదల చేయబోతున్నారు. ఇదే రోజున నేచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్ 3’ మూవీ విడుదల కాబోతుంది. ఈ సినిమా మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. రెండు క్రేజీ మూవీస్ ఒకే రోజున విడుదల కాబోతుండడం మూవీ లవర్స్ కి పండగ లాంటిది. చూడాలి మరి ఈ రెండు సినిమాల్లో ఏది సూపర్ హిట్ అవ్వబోతుంది అనేది.
Also Read : ‘మజాకా’ టార్గెట్ 11 కోట్లు..కానీ 2 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఇంతే..పాపం సందీప్ కిషన్ టైం ఇంత చెత్తగా ఉందేంటి!