Naga Shourya: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య జోరుమీదున్నాడు. వరుస సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ మార్క్ క్రియేట్ చేస్తున్నాడు. టాలీవుడ్ లో బోలెడంత మంది హీరోలున్నారు. 50 కోట్లకు మించిన పారితోషికాలు అందుకుంటున్న వారున్నారు. చిన్న హీరోలు సైతం ఈ మధ్య బాగానే సంపాదించేస్తున్నారు. అయితే నిర్మాతలు మెచ్చిన హీరోలు కొందరే ఉన్నారు. అందులో ఒకరే.. హీరో నాగశౌర్య.. ఆయన పేరులోని శౌర్యం సినిమాల్లోనూ కనిపిస్తుంటుంది.
టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది నాగశౌర్యనే అని చెప్పక తప్పదు. అన్ని పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయగల గొప్ప నటుడిగా పేరొందాడు. నిర్మాతల హీరోగా ఈయన పేరు తెచ్చుకున్నాడు. సినిమా హిట్ అయితే పర్సంటేజీలు, సినిమాకు ముందే భారీ పారితోషకాలు లాంటివేవి డిమాండ్ చేయకుండా సినిమా కోసం కష్టపడి పనిచేసే హీరో అని.. ఎంత ఇచ్చినా తీసుకునే మనసున్న నటుడన్న టాక్ టాలీవుడ్ లో ఉంది. ఇలాంటి హీరోతో సినిమా తీయాలని చాలా మంది నిర్మాతలు ఎగబడుతుంటారంటే అతిశయోక్తి కాదేమో..
తాజాగా ‘వరుడు కావలెను’ అనే సినిమాతో నాగశౌర్య మనముందుకు వస్తున్నాడు.ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ లు, ఫస్ట్ లుక్ మంచి స్పందన వచ్చింది.నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటించారు.
ఈ సందర్భంగా నాగశౌర్య హాట్ కామెంట్స్ చేశారు. సినిమా ట్రైలర్ చూశాక ఇది లేడి ఓరియెంటెడ్ డామినేటెడ్ సినిమా అంటున్నారు.కానీ సినిమాలో ఏ పాత్ర కంటే నా పాత్ర గుర్తుండిపోతుందని.. సినిమా సెకండాఫ్ లో 15 నిమిషాల ఎపిసోడ్ ఉందని.. దానిని ట్రైలర్ లో రివీల్ చేయలేదని సినిమా గురించి ఓ సీక్రట్ చెప్పాడు.
చలో నా కెరీర్ లో పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా అని.. నర్తన శాల పెద్ద గుణపాఠం అని నాగశౌర్య అన్నారు. నర్తనశాల లాంటి సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నానన్నారు.
ఇక ప్రతి హీరో, నిర్మాత, దర్శకుడికి బిగ్ ఫ్రైడే శుక్రవారం ఆందోళన ఉంటుందని.. నాకేంటి చిరంజీవి కూడా దీనికి మినహాయింపు కాదని నాగశౌర్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత రెండేళ్లుగా నేను తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నానని.. నాగశౌర్యం సంచలన నిజాన్ని చెప్పాడు. 30 ఏళ్ల వరకూ తల్లిదండ్రులతో ఉన్నానని.. చదువుకోవడం ఇంటి నుంచే జరిగిందని హాస్టళ్లకూ వెళ్లలేదని.. నన్ను నేను తెలుసుకోవడం కోసం ఇలా రెండేళ్లుగా ఒంటరిగా ఉంటున్నట్టు తెలిపారు.
వరుడు కావలెను సినిమా తర్వాత అనీష్ కృష్ణ తో తన తదుపరి చిత్రం ఉంటుందని నాగశౌర్య తెలిపారు. త్వరలోనే అమెరికాలో ‘ఫలానా అమ్మాయి, ఫలానా అబ్బాయి’ షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు.
Also Read: Rangamarthanda: కృష్ణవంశీ సినిమాకు చిరంజీవి వాయిస్ ఓవర్!