
కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల అమలు తరువాత థియేటర్లు మూతబడటంతో ప్రేక్షకులు ఓటీటీల వైపు ఆకర్షితులయ్యారు. ఈ భాష, ఆ భాష అనే తేడాల్లేకుండా అన్ని భాషల్లో ఓటీటీల్లో విడుదలైన సినిమాలను చూశారు. మరోవైపు థియేటర్లలో టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటంతో సినిమాకు హిట్ టాక్ వస్తే తప్ప ప్రేక్షకులు థియేటర్ల వైపు అడుగులేయడం లేదు. నాగార్జున హీరోగా నటించిన వైల్డ్ డాగ్ సినిమా గత శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే.
Also Read: ‘త్రివిక్రమ్’ ప్లేస్ లో ‘అట్లీ’.. ఎన్టీఆర్ ప్లేస్ లో మహేష్ !
ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే ప్రయోగాత్మక సినిమా కావడంతో ఈ సినిమా భారీగా ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. మరోవైపు నాగార్జున ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎక్కువగా హిట్ కాకపోవడంతో ఆ ప్రభావం కూడా వైల్డ్ డాగ్ సినిమాపై పడింది. వీకెండ్ వరకు వైల్డ్ డాగ్ కలెక్షన్లు పరవాలేదనిపించే స్థాయిలో ఉండగా వీక్ డేస్ లో మాత్రం కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి.
నిన్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమాకు కేవలం 27 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఇప్పటివరకు 2.72 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి వైల్డ్ డాగ్ సినిమాను సోషల్ మీడియా వేదికగా ప్రశంసించడంతో పాటు ఈ సినిమా ప్రెస్ మీట్ కు హాజరై సినిమా గురించి గొప్పగా చెప్పారు. చిరంజీవి ప్రచారం చేసినా ఈ సినిమా కలెక్షన్లపరంగా పుంజుకోకపోవడం గమనార్హం.
Also Read: నాగబాబును ఆదుకున్న బ్రహ్మానందం
ఫుల్ రన్ లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 4 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. వైల్డ్ డాగ్ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమా ద్వారా నిర్మాతలకు నష్టాలు తప్పవని తెలుస్తోంది.