Tomatoes Benefits: ప్రతిరోజు మనం తీసుకునే ఆహారం మనకు ఎన్నో విధాలా మేలు చేస్తుంది. మనం తినే కూరగాయలు మనకు లాభాలు చేకూరుస్తాయి. గుండెజబ్బులు రాకుండా నిరోధిస్తాయి. టమాటాలతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. టమాటాల్లో పోషక విలువలు మెండుగా ఉంటాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. టమాటాల్లో లుటిన్, లైకోపీస్ వంటి కెరోటినాయిడ్లు ఉండటంతో కంటికి సమస్యలు రాకుండా చూస్తాయి. పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం కూడా రాకుండా చేస్తుంది.

టమాటాల్లో విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో దీన్ని తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్య పరిరక్షణ కలుగుతుంది. అధిక మోతాదులో బీటా కెరోటిన్ ఉండటం వల్ల క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా నిరోధిస్తుంది. టమాటాల్లో ఉండే లైకోపీస్ పుష్కలంగా ఉండటంతో క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా చేస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయి. పండ్లు, కూరగాయలు తినడం వల్ల పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది. బీటా కెరోటిన్ అధికంగా ఉండటం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది.
టమాటాల్లో పీచు, పొటాషియం, విటమిన్ సి, కోలిన్ అన్ని గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. హృదయ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది. టమాటాల్లో పోలేట్ ఉంటుంది. ఇది హోమోసిస్టీన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. పోలేట్ తో మోసిస్టీన్ స్థాయిలను నియంత్రించడంతో గుండె పోటు సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. టమాటాలతో ఎన్నో రకాల కూరలు చేసుకుంటారు. టమాట పులుసు చేసుకుంటారు. టమాటా పచ్చడి, టమాటా సూప్ వంటివి చేసుకుంటూ ఉంటారు.

టమాటాల్లో పోషక విలువలు బాగుంటాయి. దీంతో అన్ని కూరల్లో టమాటాను చేర్చుకుంటారు. ఆరోగ్యానికి కూడా మంచి ఉపయోగకారిగా ఉంటుంది. అందుకే టమాటాలను విరివిగా వాడతారు. ఈ నేపథ్యంలో టమాటాలతో ఏ వంటకం చేసుకున్నా దాని రుచే వేరుగా ఉంటుంది. టమాటాలతో పలు రకాల వ్యాధులు కూడా దూరం అవుతాయి. గుండెకు కూడా ఎంతో మేలు. టమాటాల వాడకంతో పలు రకాల రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. టమాటాలను తీసుకుని వంటల్లో ఉపయోగించుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు.