Akkineni Nagarjuna : చిరంజీవి ని చూసి బుద్ధి తెచ్చుకో అని మా నాన్న నన్ను తిట్టేవాడు అంటూ నాగార్జున షాకింగ్ కామెంట్స్!

ఆయన మాట్లాడుతూ 'అప్పట్లో ఇదే అన్నపూర్ణ స్టూడియోస్ లో చిరంజీవి గారి సినిమాకి సంబంధించిన సాంగ్ షూటింగ్ జరుగుతుంది. అప్పటికి నేను ఇంకా సినిమాల్లోకి రాలేదు. నాన్నగారు ఆరోజు నన్ను పిలిచి, మన స్టూడియోలో చిరంజీవి సినిమా సాంగ్ షూటింగ్ జరుగుతుంది.

Written By: Vicky, Updated On : October 29, 2024 4:37 pm

Akkineni Nagarjuna

Follow us on

Akkineni Nagarjuna :  అక్కినేని నాగేశ్వరరావు జనించి 100 ఏళ్ళు పూర్తి అయిన ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మెగా స్టార్ చిరంజీవి కి అక్కినేని మెమోరియల్ అవార్డుని గత నెలలో అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటన చేసాడు. ఈ సందర్భంగా నిన్న గ్రాండ్ గా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ ఈవెంట్ ని ఏర్పాటు చేసి బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా చిరంజీవి కి ప్రత్యేక సన్మానం చేసి అవార్డు ని ఇప్పించారు. ఈ ఈవెంట్ మొత్తం ఎంతో ఆహ్లాదకరంగా జరిగింది. చిరంజీవి, అమితాబ్ బచ్చన్ తో పాటు, ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులందరూ ఈ ఈవెంట్ కి విచ్చేసారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున చిరంజీవి, అమితాబ్ బచ్చన్ గురించి గొప్పగా మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఆయన మాట్లాడుతూ ‘అప్పట్లో ఇదే అన్నపూర్ణ స్టూడియోస్ లో చిరంజీవి గారి సినిమాకి సంబంధించిన సాంగ్ షూటింగ్ జరుగుతుంది. అప్పటికి నేను ఇంకా సినిమాల్లోకి రాలేదు. నాన్నగారు ఆరోజు నన్ను పిలిచి, మన స్టూడియోలో చిరంజీవి సినిమా సాంగ్ షూటింగ్ జరుగుతుంది. అతను అద్భుతంగా డ్యాన్స్ వేస్తాడు. వెళ్లి చూడు, సినిమాల్లోకి రావాలని అంటున్నావ్, డ్యాన్స్ ఎలా చెయ్యాలో తెలుస్తుంది అని చెప్పారు. నేను ఆరోజు స్పాట్ కి వెళ్లాను, అప్పుడే చిరంజీవి, రాధ మధ్య సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. చిరంజీవి గారి డ్యాన్స్ స్టెప్పులను చూసి నాకు భయం వేసింది. ఈయన ఇలా వేస్తున్నాడేంటి, మనకి కష్టమే ఇలాంటివి, మనం వేరే కొత్తదారిలో వెళ్లి ప్రయత్నం చేద్దాం అనుకున్నాను’ అని అంటాడు.

ఇక ఆ తర్వాత ఆయన అమితాబ్ బచ్చన్ గురించి మాట్లాడుతూ ‘రీసెంట్ గానే నేను కల్కి చిత్రాన్ని చూసాను. ఆ చిత్ర దర్శకుడు నాగి ఇక్కడే ఉన్నాడు. సినిమా చూసిన వెంటనే బచ్చన్ గారికి ఫోన్ చేసి ‘నేనే అభిమానించే మాస్ అమితాబ్ బచ్చన్ తిరిగి వచ్చేసాడు’ అని అన్నాను. దానికి ఆయన పెద్దగా నవ్వాడు. కల్కి సినిమాలో మిమ్మల్ని చూసినప్పుడు నాకు పాత అమితాబ్ బచ్చన్ గారే గుర్తుకు వచ్చారు. మాకు ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు అమిత్ జీ’ అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున.ఇలా ఈవెంట్ మొత్తం ఎంతో ఆహ్లాదకరంగా, పాత రోజులను గుర్తు చేసుకుంటూ సాగింది. నాగార్జున ఈ ఈవెంట్ పట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో ట్వీట్ వేసాడు. కేవలం ఆయన మాత్రమే కాకుండా చిరంజీవి, అమితాబ్ బచ్చన్ కూడా నిన్న సాయంత్రం జరిగిన మధుర క్షణాలను తల్చుకుంటూ ట్వీట్స్ వేశారు. ఈ ఈవెంట్ కి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. చిరంజీవి కి, అక్కినేని ఫ్యామిలీ కి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి తల్చుకుంటూ అభిమానులు చాలా సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు.