Naa Saami Ranga: కింగ్ నాగార్జున జన్మదినం నేడు. ఆయన 64వ ఏట అడుగుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాగార్జున అభిమానులు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా నాగార్జునకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ప్రోమో చూస్తుంటే ఈసారి నాగార్జున గట్టిగా కొట్టేలా ఉన్నాడు. ‘నా సామిరంగ’ అంటూ సంక్రాంతి బరిలో దిగాడు.
నా సామిరంగ టైటిల్ తో పాటు నాగార్జున మాస్ లుక్ కేక అని చెప్పాలి. చుట్టూ కత్తులతో రౌడీలు ఉండగా నాగార్జున పులిలా భయపెట్టాడు. ఒక్కొక్కరినీ గాల్లోకి ఎగరేసి తన్నాడు. లుంగీ కట్టులో బీడీ తాగుతూ నాగార్జున ఊరమాస్ అవతార్ లో కనిపించాడు. టైటిల్ కూడా చాలా మాసీగా ఉంది. నా సామిరంగ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్థం అవుతుంది. ”ఈ సారి పండక్కీ నా సామిరంగ” అని నాగార్జున టీజర్ ముగించాడు.
2024 సంక్రాంతికి నా సామిరంగ చిత్రం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మహేష్ బాబు గుంటూరు కారం, రవితేజ ఈగిల్ సంక్రాంతి బరిలో ఉన్నాయి. తాజాగా నా సామిరంగ వచ్చి చేరింది. ఈ చిత్రానికి విజయ్ బిన్నీ దర్శకుడు. ఆయన డెబ్యూ మూవీ ఇది. బెజవాడ ప్రసన్న కుమార్ స్టోరీ, మాటలు అందించారు. కీరవాణి సంగీతం అందించారు. టీజర్లో ఆయన అందించిన బీజీఎమ్ చాలా బాగుంది.
నా సామిరంగ చిత్రంలోని ఇతర నటుల వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీనివాస్ చిత్తూరి నిర్మిస్తున్నారు. ఇక వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్న నాగార్జున హిట్ కోసం తాపత్రయ పడుతున్నారు. ఇటీవల ఆయన నటించిన వైల్డ్ డాగ్, ఘోస్ట్ చిత్రాలు నిరాశపరిచాయి. బంగార్రాజు తర్వాత నాగార్జున హిట్ లేదు. కలిసొచ్చిన సంక్రాంతికి నా సామిరంగ మూవీతో హిట్ కొడతాడేమో చూడాలి.
