Nagarjuna: టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో అక్కినేని నాగార్జున ఘోస్ట్ అనే సినిమాలో నటిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతుంది. ఐతే, మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను ఫైనల్ చేసింది టీమ్. కానీ, మధ్యలోనే కాజల్ గర్భవతి కావడంతో ఇక చేసేది ఏమి లేక నాగార్జున సరసన నటించాల్సిన ‘ది ఘోస్ట్’ సినిమా నుంచి ఆమె తప్పుకుంది.

ఇప్పుడు ఆమె స్థానంలో సోనాల్ ను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సోనాల్ కూడా ఛాన్స్ లను అందిపుచ్చుకోవడానికి ప్రత్యేక పీఆర్వో టీమ్ ను కూడా పెట్టుకుంది. ఈ క్రమంలోనే సోనాల్ హీరోయిన్ గా నటించడానికి ఆసక్తిగా ఉంది, మీ సినిమాలో పెట్టుకోండి అంటూ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారును సోనాల్ టీమ్ అప్రోచ్ అయ్యారు. కాజల్ ఎలాగూ నటించట్లేదు కాబట్టి.. ఆమె ప్లేస్ లో సోనాల్ అయితే బాగుంటుంని ప్రవీణ్ సత్తారు కూడా ఫీల్ అయ్యాడు.
Also Read: కొడాలి నానిని తలుచుకున్న ఆర్జీవీ.. మొత్తానికి తెలిసేలా చేశాడుగా..!
అయితే, నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. మరి నాగార్జున సోనాల్ కి ఓటేస్తాడా ? చూడాలి. ఒకవేళ నాగార్జున ఒప్పుకుంటే.. త్వరలో సోనాల్ ఎంపికపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయనుంది. గతంలో సోనాల్ బాలయ్య సినిమాల్లో నటించింది. తెలుగులో ఆమెకు బాలయ్య తప్ప మరో హీరో ఛాన్స్ ఇవ్వలేదు. బాలయ్య సరసన హీరోయిన్ గా చేసింది అని.. యంగ్ హీరోలు ఆమెను పట్టించుకోలేదు. కానీ సోనాల్ లో మంచి మ్యాటర్ ఉంది. కాబట్టి.. నాగార్జున ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. సోనాల్ కి మరో బిగ్ ఛాన్స్ వచ్చినట్లే. మరి చూడాలి ఏమి జరుగుతుందో.. !
Also Read: దేశంలో కరోనా కల్లోలం.. ఒక్కరోజులోనే 2.8 లక్షల కొత్త కేసులు.. పెరుగుతున్న మరణాలు!