Homeఆంధ్రప్రదేశ్‌MP Raghu Rama Krishnam Raju Protest: కడుపు మాడ్చుకొని ఎంపీ రఘురామ నిరసన.. ఎవరి...

MP Raghu Rama Krishnam Raju Protest: కడుపు మాడ్చుకొని ఎంపీ రఘురామ నిరసన.. ఎవరి కోసమో తెలుసా?

MP Raghu Rama Krishnam Raju Protest Over AP Govt Employees PRC Issue : ఏపీ రాజకీయాల్లో కేఏ పాల్ తర్వాత అంతగా ఎంటర్ టైన్ చేయగల నేత ఎవరయ్యా అంటే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును చెప్పుకోవచ్చు. కేఏ పాల్ డైరెక్టుగా కామెడీ చేస్తే.. రఘురామ మాత్రం ప్రతీసారి జగన్ పై విమర్శలతో తనదైన శైలిలో కామెడీ చేస్తుంటాడు. వీరిద్దరికీ మీడియానే ఆయుధం.

mp raghurama

తాజాగా ఎంపీ రఘురామ కడుపు మాడ్చుకున్నాడు. కానీ దానికో ఓ కారణం ఉంది. ఆయన ఉద్యోగుల సమస్యలు తీర్చాలని జగన్ సర్కార్ పై ‘ఉపవాస దీక్ష’ చేపట్టాడు. ఏపీ ఉద్యోగుల పీఆర్సీ, ఐఆర్ విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులకు నిరసనగా ఆయన దీక్ష చేపట్టారు. ఢిల్లీలోని తన నివాసంలో ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఈ ఉపవాస దీక్ష కొనసాగనుంది.

Also Read:  విషాదం: ప్రముఖ తెలుగు నటుడు మృతి !

11వ పీఆర్సీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై ప్రభుత్వ ఉద్యోగులు అందరూ అసంతృప్తిగా ఉన్నారని ఆయన అన్నారు. వారికి సంఘీభావంగా ఉపవాస దీక్ష చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజలందరూ కూడా తమ మద్దతు తెలియజేయాలని ఎంపీ కోరారు.జగనన్న ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీని కానుకగా ఇచ్చారని సెటైర్లు వేశారు.

మొత్తంగా గెలిపించిన పార్టీ పైనే పోరు సలుపుతున్నారు. అధికార పార్టీపై ఉద్యోగుల కోసం రఘురామ దీక్ష చేపట్టారు. ఈ మేరకు లైవ్ పెట్టి.. చానెళ్లను మోహరింపచేసి పొద్దున్నుంచి రాత్రి వరకూ ఢిల్లీలో ఏపీ ప్రజలను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయ్యారు. చూసి తరించండి..

LIVE: MP Raghu Rama Krishnam Raju Press Meet | Protest Over AP Govt Employees PRC Issue

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version