RGV: ఏపీలో సినిమా టికెట్ ధరల విషయంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఏపీ మంత్రులకు మధ్య ట్విట్టర్ వార్ నడిచిన విషయం తెలిసిందే. మంత్రి పేర్ని నానికి ఆర్జీవీ ఏకంగా పదికి పైగా ప్రశ్నలు సంధించి పెనుదుమారం రేపారు. సీఎం జగన్ అంటే అభిమానం అంటూనే తన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తప్పుబడుతూ వచ్చారు. సినిమా టికెట్ ధరలు నిర్ణయించడానికి మీరెవరూ అంటూ ఫైర్ అయ్యాడు. ఈ క్రమంలోనే మంత్రి కొడాలి నానితో కూడా వర్మ మాటల యుద్ధాన్ని ప్రకటించాడు. దీంతో తనకు నేచురల్ స్టార్ నాని తప్పా ఈ కొడాలి నాని అంటే ఎవరో తెలీదని వర్మ ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. దీనిపై స్పందించిన మంత్రి నేనేంటో తెలిసేలా చేస్తానని ప్రకటించాడు. తాజాగా నాని తన పంతం నెగ్గించుకున్నట్టు తెలుస్తోంది. ఉన్నట్టుండి వర్మ కొడాలి నాని ప్రశంసలతో ముంచెత్తాడు.

అందుకు కారణం నాని నియోజకవర్గం గుడివాడలో గోవా కాసినోలు వెలిశాయి. దీనికి మంత్రి కొడాలి నాని చొరవ తీసుకున్నారని తెలిసింది. ఈ నిర్ణయాన్ని అందరూ విమర్శిస్తున్నారు. కానీ రామ్ గోపాల్ వర్మకు మాత్రం ఇవి బాగా నచ్చాయట. అందువల్లే గతంలో వర్మ చేసిన కామెంట్లను మర్చిపోయి కొడాలి నానిని అభినందిస్తూ ట్వీట్లు పెట్టారు. గుడివాడను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారని. లండన్ , పారిస్, వేగాస్ స్థాయిలో ఉంచినందుకు అభినందనలు అని చెప్పారు.
Also Read: సోనూసూద్ ఖాతాలో మరో అరుదైన ఘనత !
అంతటితో ఆగకుండా గుడివాడలో గోవా కల్చర్‌ను వ్యతిరేకించే వారిని డంబోస్‌గా అభివర్ణిస్తూ తిట్టిపోశారు. గుడివాడ ప్రజలు గోవా స్టైల్ కేసినోలను చూస్తారు కానీ, గోవా ప్రజలు గుడివాడ రారని తెలుసుకోవాలని చెప్పుకొచ్చారు. కాసినోలను తీసుకొచ్చిన క్రిడిట్ మొత్తాన్ని కొడాలి నానికి ఇచ్చేశారు ఆర్జీవీ. దీనిపై స్పందించిన వైసీపీ నేతలు, మంత్రులు గుడివాడ కేసినోలకు మంత్రి కొడాలి నానికి ఎటువంటి సంబంధం లేదని ఆయన కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వాదిస్తున్నారు.

మరో వైపు ఈ కేసినోల వ్యవహారంపై విచారణ జరిపేందుకు పోలీసులు ఓ విచారణాధికారిని నియమించారు. ఎవరి స్థాయిలో వారు అద్భుతంగా నటిస్తున్నారు. ఏపీని గంజాయి, జూద కేంద్రాలుగా మార్చేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తున్నట్టు విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న చేస్తున్నాయి. మంత్రి ప్రమేయం లేకుండా గుడివాడలో కేసినోలు ఎలా ఓపెన్ అయ్యాయంటూ విపక్షనేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాగా, దీనిపై జగన్ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.
Also Read: దేశంలో కరోనా కల్లోలం.. ఒక్కరోజులోనే 2.8 లక్షల కొత్త కేసులు.. పెరుగుతున్న మరణాలు!