Homeఎంటర్టైన్మెంట్Nagarjuna- Vennela Kishore: వెన్నెల కిషోర్ కు నాగార్జున వార్నింగ్.. నా కోడలు జోలికి రావద్దని...

Nagarjuna- Vennela Kishore: వెన్నెల కిషోర్ కు నాగార్జున వార్నింగ్.. నా కోడలు జోలికి రావద్దని హెచ్చరిక

Nagarjuna- Vennela Kishore: తెలుగులో ప్రస్తుతం కామెడీ స్టార్ బ్రహ్మానందం ప్రాధాన్యం తగ్గింది. ఆయనకు వయసు సహకరించడం లేదు. దీంతో సినిమాల్లో కనిపించడం లేదు. తనదైన కామెడీతో అందరిని అలరించిన బ్రహ్మానందం మెల్లమెల్లగా సినిమాలకు దూరమవుతున్నాడు. కామెడీ అంటేనే బ్రహ్మానందంగా ఉన్న రోజులలో ఆయన నటనకు అందరు ముగ్దులయ్యేవారు. సినిమాలో అతడున్నాడంటే సినిమా హిట్టే అనే భావన కలిగేది. కాలక్రమంలో వయోభారంతో సినిమాలు చేయడానికి ఇష్టపడటం లేదు. దీంతో ఆయన స్థానాన్ని మరో కమెడియన్ వెన్నెల కిషోర్ భర్తీ చేస్తున్నారు. ప్రస్తుత తరం హీరోలకు ఫ్రెండ్ గా నటిస్తూ నిలదొక్కుకుంటున్నాడు. కామెడీ పర్పస్ తో కిషోర్ కు మంచి పేరు దక్కుతోంది.

Nagarjuna- Vennela Kishore
Nagarjuna- Vennela Kishore

ఎప్పుడు ఎవరిని ఒక్క మాట కూడా అనని కిషోర్ హీరోయిన్ కృతి శెట్టిని ఏడిపించాడని టాక్. దీంతో నాగార్జున కిషోర్ ను పిలిపించి తిట్టి వార్నింగ్ ఇచ్చాడని సమాచారం. తన కోడలును ఇంకోసారి ఏదైనా అంటే బాగుండదని హెచ్చరించాడని పరిశ్రమ వర్గాల భోగట్టా. ఆడపిల్లను ఏడిపించడం ఏమిటి? తనకెవరు లేరనుకున్నావా? తాను మా కోడలు. దీంతో కిషోర్ కూడా కిమ్మనకుండా వెళ్లిపోయాడట. బంగార్రాజు సినిమాలో వెన్నెల కిషోర్, హీరోయిన్ కృతిశెట్టి మధ్య కొన్ని సంభాషణలు ఉన్నాయట. ఈ సందర్భంగానే కిషోర్ ఆమెను కామెంట్ చేసినట్లు తెలిసింది.

కృతి శెట్టి భాష తెలియదని హేళన చేసినట్లు చెబుతున్నారు. తన కోడలు విషయంలో ఎవరు కలుగజేసుకున్నా మర్యాదగా ఉండదని చెప్పాడట. మీ పని మీరు చూసుకోండి. పక్కవారి గురించి మీకెందుకని ప్రశ్నించాడు. దీంతో అందరు నోరు మూసుకున్నారట. వెన్నెల కిషోర్ ను ఉద్దేశించి పలు మాటలు అన్నాడట. ఇక మీదట తన కోడలు విషయంలో ఎలాంటి కామెంట్లు వచ్చినా సహించేది లేదు. భాష రాకపోతే నేర్చుకుంటుంది అది మీకెందుకు? ఏం అవసరం? ఎవరు ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే మంచిదని సూచించారు.

Nagarjuna- Vennela Kishore
Nagarjuna- Vennela Kishore

తనను ఏడిపిస్తున్నారని కృతి శెట్టి నాగ్ తో చెప్పుకోవడంతోనే కిషోర్ ను పిలిపించి మాట్లాడినట్లు సమాచారం. తన విషయంలో ఇంకోసారి ఇలా జరిగితే నీ రెమ్యునరేషన్ కట్ చేయిస్తానని స్ట్రిక్ గా వార్నింగ్ ఇచ్చాడని చెబుతున్నారు. మొత్తానికి వెన్నెల కిషోర్ కు గట్టి హెచ్చరికే వచ్చింది. హీరోయిన్ల విషయంలో ఆయనకేంటి ఇంట్రస్ట్. తన పని తాను చేసుకుని చక్కగా వెళ్లిపోవాలి. తనకుండే డైలాగులను సరిగా చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాలి. కానీ ఇలా హీరోయిన్ల విషయంలో తల దూర్చితే ఇలాగే ఉంటుంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version