Bigg Boss 7 Telugu: ఈ వారం నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్ తడబడ్డాడు. సందీప్ తో ఆర్గ్యూ చేసే క్రమంలో నోరు జారాడు. పల్లవి ప్రశాంత్ ఓ పాయింట్ మీద సందీప్ ని నామినేట్ చేశాడు. నేను కెప్టెన్ గా ఉన్నప్పుడు నువ్వు ఇజ్జత్ ఇవ్వలేదు. కెప్టెన్సీ అంటే నీకు తెలియదా అన్నాడు. నాకు హౌస్లో అందరూ ఒకటే. ఎవరినీ తక్కువగా చూడనని పల్లవి సందీప్ అన్నాడు. ఈ విషయంలో ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. నీది పరిపక్వత లేని గేమ్ అని సందీప్ అన్నాడు.
అనంతరం తనని నామినేట్ చేసిన ప్రశాంత్ ని సందీప్ తిరిగి నామినేట్ చేశాడు. మరలా ఇజ్జత్ మేటర్ వచ్చింది.వాడివేడి వాదులాటలో ప్రశాంత్… నువ్వు నన్ను ఊరోడు అన్నావ్, అని సందీప్ పై ఆరోపణ చేశాడు. దీంతో సందీప్ కి బలం చేకూరింది. ఈ పాయింట్ మీద గట్టిగా వాదించాడు. నేను గౌరవించే డాన్స్ వృత్తి మీద ఒట్టేసి చెబుతున్నా నేను ఊరోడు అనలేదు. నువ్వు కూడా భూమి మీద, తిండి మీద ఒట్టేసి చెప్పు నేను అన్నానని ఫైర్ అయ్యాడు.
వెంటనే ప్రశాంత్ మాట మార్చాడు. నా ఊరు గురించి మాట్లాడావు అన్నాడు. పల్లవి ప్రశాంత్ నోరు జారాడని ప్రేక్షకులు కూడా అర్థమైంది. హోస్ట్ నాగార్జున నేడు ఇదే విషయం బయటకు తీశాడు. ఊరోడు అనలేదని సందీప్ ఒట్టు వేసినప్పుడు నువ్వెందుకు వేయలేదని ప్రశాంత్ ని అడిగాడు. ప్రశాంత్ దగ్గర ఆన్సర్ లేదు. ఒక ఆరోపణ చేసే ముందు వెనుకా ముందు ఆలోచించి చేయాలి. అయినా ఊరోడు అంటే తప్పేంటని నాగార్జున అన్నాడు.
ఇక్కడ అందరూ ఊరి నుండి వచ్చిన వాళ్లే. మా నాన్న నాగేశ్వరరావు కూడా ఊరోడే. ఆ పదంలో ఎలాంటి తప్పు లేదు. ఊరే మనకు తిండి పెడుతుందని ప్రశాంత్ కి నాగ్ క్లాస్ పీకాడు. దొరికిన పోయిన ప్రశాంత్ మౌనంగా ఉన్నాడు. ఇక కేక్ తిన్న అమర్ ని, ఫిర్యాదు చేయని శోభాను, తేజాను కూడా నాగార్జున తప్పుబట్టారు. బిగ్ బాస్ ఆదేశించకుండా కేక్ తిన్న అమర్ చాలా తప్పు చేశావన్న నాగార్జున, పర్యవసానం సీరియస్ గా ఉంటుందని హెచ్చరించాడు.
Nagarjuna steps in to correct the contestant's mistake, and things get heated! 🔥 Curious about how it all unfolds? Don't miss 'Bigg Boss,' airing every Mon-Fri at 9:30 PM and Sat-Sun at 9 PM to find out! 📺 @iamnagarjuna @DisneyPlusHSTel https://t.co/BKp2twhSWp
— Starmaa (@StarMaa) October 21, 2023