Bigg Boss 6 Telugu Episode 31: బిగ్ బాస్ బర్త్ డే అంటూ ఈరోజు తెగ సందడి చేశవారు. బర్త్ డే పూట తనను ఎంటర్ టైన్ చేయాలంటూ ఇంటిసభ్యులందరినీ ఓ ఆట ఆడించాడు. ఎప్పుడూ వినపడని.. అప్పుడప్పుడు మాత్రమే వినపడే బిగ్ బాస్ గొంతుతో ఈరోజు ఇంటి సభ్యులను తనకు ఎంటర్ టైన్ మెంట్ కోసం తెగ ఆడించేశాడు. కంటెస్టెంట్ల కామెడీ నచ్చకపోతే గురకపెట్టి నిద్రపోయాడు.

ఇక గలాట గీతూకు చికెన్ తినిపించి మరీ ఆమెతో సరదాగా ఆడుకున్నాడు బిగ్ బాస్.. ‘నువ్వు మరీ కామెడీ అయిపోయావ్ బిగ్ బాస్’ అనేంతగా సెటైర్లు వేశారు. బిగ్ బాస్ అంటేనే గంభీరమైన వాయిస్.. కానీ ఈరోజు మొత్తం కామెడీపీస్ గా మారి కంటెస్టెంట్లతో సరదాగా ఆడేసుకున్నాడు. బిగ్ బాస్ గురకపెట్టి పడుకునే సిత్రాలు కనిపించాయి. తన బర్త్ డే అంటూ బిగ్ బాస్ చేసిన సందడి అంతా ఇంతాకాదు.
బిగ్ బాస్ ఇలా కామెడీ చేయడంతో ఇంటిలోని గీతూ, ఫైమా సహా ఇంటి సభ్యులు తమ పర్ ఫామెన్స్ తో కళ్లు తాగిన కోతిలా గెంతులేశారు.. ఆస్కార్ పర్ ఫామెన్స్ ఇచ్చారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లను అడిగి మరీ పర్ ఫామ్ చేయమని అడగడంతో రెచ్చిపోయాడు.
ఇక అర్జున్-శ్రీసత్య జోడిని విడదీసిన బిగ్ బాస్ శ్రీహాన్ ను అడిగి మరీ శ్రీసత్య రోమాన్స్ చేసేలా చేశాడు. వీరిద్దరి రోమాన్స్ చూసి అర్జున్ కుల్లుకుని చచ్చాడు. శ్రీసత్యను ఎత్తుకొని శ్రీహాన్ తిప్పుతుంటే చూడలేక అర్జున్ కు ఏడుపు ఒకటే తక్కువ.
ఇక గీతూకు స్పెషల్ రూంకు పిలిచి మరీ చికెన్, థమ్స్ అప్ ఇచ్చి ఆమె తో సరదాగా గాసిప్పులను చెప్పించుకున్నాడు. ఆరోహి పోవడంతో సూర్యపై ఇనాయా మనసు పడిందని.. అక్కడ రగులుతోంది మొగలిపొద అంటూ గీతూ గాసిప్పులు చెప్పుకొచ్చింది. అనంతరం ఫైమాను పిలిచి 100 అంకెలు లెక్కపెట్టించి ఆమెకు పిజ్జాను కానుకగా ఇప్పించి తినిపించాడు.
ఇక ఫైమాకు అర్ధరాత్రి ఇంటి సభ్యుల నిద్రను ఖరాబ్ చేయాలని ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.. రాత్రి పూట ఫైమా చేసే రచ్చను మరో ఎపిసోడ్ లో చూపించబోతున్నారు.
ఆర్జే సూర్య పర్ ఫామెన్స్ తో రెచ్చిపోయాడు. పిచ్చోడిలా మారి పిచ్చి చేష్టలతో ఓవర్ యాక్షన్ చేశాడు. కాసేపు మిమిక్రీ చేసి అలరించాడు. ఇనాయా పిల్ల చేష్టలతో అతి చేసింది.
మొత్తానికి నేటి బిగ్ బాస్ బర్త్ డే ఎపిసోడ్ కొంచెం ఎంటర్ టైన్ మెంట్ పంచింది. బిగ్ బాస్ ఎప్పుడూ ఇలా కామెడీ చేయడం ప్రేక్షకులు చూడలేదు. అదొక్కటే వెరైటీ.