Godfather Review: నటీనటులు: చిరంజీవి -నయనతార-సల్మాన్ ఖాన్-సత్యదేవ్-సునీల్-మురళి శర్మ-సముద్ర ఖని -గెటప్ శ్రీను తదితరులు
మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా తెలుగు మరియు హిందీ బాషలలో విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..ఎవ్వరు ఊహించని విధంగా ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది..ఈ ఏడాది విడుదలైన ఆచార్య సినిమా డిజాస్టర్ ఫ్లాప్ తో తీవ్రమైన నిరాశలో ఉన్న మెగా ఫాన్స్ కి గాడ్ ఫాదర్ చిత్రం ఒక కనుల పండుగలాగా కనిపించింది..మూవీ లో ఇంట్రడక్షన్ సన్నివేశం నుండి చివరి వరుకు ఒక్క సన్నివేశం లో కూడా డల్ మూమెంట్స్ లేకుండా తీసాడు ఆ చిత్ర దర్శకుడు మోహన్ రాజా..ఇక సినిమా కథ ,కథనం నటీనటుల నటన ఎలా ఉందొ ఇప్పుడు మనం క్లుప్తంగా చూడబోతున్నాము.

కథ :
రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోయిన తర్వాత రాష్ట్రలో ఎన్నో పెను మార్పులు చోటు చేసుకుంటాయి..చనిపోయిన ముఖ్యమంత్రి స్థానం లో కూర్చోవడానికి సీఎం కూతురు సత్య ప్రియా (నయనతార) మరియు సీఎం అల్లుడు జయదేవ్ (సత్యదేవ్ ) ప్రయత్నిస్తూ ఉంటారు..అలాంటి సమయం లో బ్రహ్మ (చిరంజీవి) ఎంటర్ అవుతాడు..బ్రహ్మ సీన్ లోకి అడుగుపెట్టిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతాయి..జయదేవ్ చేస్తున్న అకృత్యాలను దెబ్బ తీస్తూ బ్రహ్మ ఎత్తుకు పై ఎత్తులు ఇస్తూ ఉంటాడు..ఆలా వాళ్ళిద్దరి మధ్య జరిగే మైండ్ గేమ్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది..సీఎం సీట్ కోసం జయదేవ్ చేసే అరాచకాలకు అడ్డుకట్ట వేసి బ్రహ్మ ఎలా రాష్ట్రాన్ని కంట్రోల్ లోకి తెచ్చాడు అనేది మిగిలిన స్టోరీ.
విశ్లేషణ:
మెగాస్టార్ చిరంజీవి గారికి రీ ఎంట్రీ తర్వాత అద్భుతమైన పాత్ర ఇప్పుడు పడింది అని చెప్పాలి..బ్రహ్మ గా మెగాస్టార్ తన నట విశ్వరూపం చూపించాడు..ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి గారు చెప్పినట్టే చాలా సన్నివేశాలలో మెగాస్టార్ చిరంజీవి తన కనుసైగ పవర్ తోనే సన్నివేశాలను రక్తి కట్టించారు..ముఖ్యం గా పోరాట సన్నివేశాలలో మెగాస్టార్ చిరంజీవి తన విశ్వరూపం చూపించాడని చెప్పాలి..వయస్సు కి తగిన పాత్ర కావడం తో చాలా సహజం గా కూడా అనిపించింది..ఇక చిరంజీవి గారి తో ఢీ అంటే ఢీ అనే విధంగా జయదేవ్ పాత్ర లో రెచ్చిపోయాడు సత్యదేవ్..సత్యదేవ్ అద్భుతమైన నటుడు అనే విషయం మన అందరికి తెలిసిందే..ఇతగాడికి మంచి రోల్ పడితే ఇండస్ట్రీ లో పెద్ద రేంజ్ స్టార్ గా ఎదుగుతాడని ఇతని సినిమాలు చూసే ఎవ్వరైనా చెప్పేయొచ్చు..గాడ్ ఫాదర్ సినిమా లో ఆయనకి అలాంటి పాత్రనే దక్కింది అని చెప్పాలి..ఈ చిత్రం తర్వాత సత్యదేవ్ కెరీర్ మరోలా ఉండే అవకాశం కూడా లేకపోలేదు.

ఇక ఈ చిత్రం లో బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ఒక ముఖ్య పాత్రలో నటించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇంటర్వెల్ లో ఆయన ఎంట్రీ ఇస్తాడు..అదిరిపోతోంది..సల్మాన్ ఖాన్ పాత్ర పర్వాలేదు అని అనిపించినప్పటికీ ఆయన వల్ల ఈ సినిమాకి ఉపయోగం ఏమిటి అనే సందేహం రాకమానదు..ఎందుకంటే ఆ పాత్రలో మన తెలుగు లో వేరే స్టార్ హీరో చేసి ఉంటె కచ్చితంగా హైప్ ఇంకా ఎక్కువ ఉండేది..ఇక నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమి ఉంది..ఎప్పటిలాగానే ఈసారి కూడా అదరగొట్టేసింది..మిగిలిన తారాగణం మురళి శర్మ మరియు సముద్ర ఖని వంటి వారు కూడా తమకి ఇచ్చిన పాత్రలకు న్యాయం చేసారు..మొత్తానికి డైరెక్టర్ మోహన్ రాజా ఈ రీమేక్ సినిమాని ఎక్కడ తగ్గకుండా ఒరిజినల్ వెర్షన్ కంటే అద్భుతంగా తీసాడు..ఈ సినిమా చూస్తే మెగాస్టార్ అంటే ఆయనకీ ఎంత ఇష్టమో అర్థం అవుతుంది..ఇదంతా ఒక ఎత్తు అయితే సంగీత దర్శకుడు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ఆయువు పట్టు లాగ నిలిచింది..అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునేలా చేసింది.
చివరి మాట :
ఒక్క మాటలో చెప్పాలంటే మాతృక లూసిఫెర్ సినిమాకంటే ‘గాడ్ ఫాదర్’ ఎంతో బాగుంది..లూసిఫెర్ సినిమా స్క్రీన్ ప్లే స్లో గా ఉంటె..గాడ్ ఫాదర్ స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్ గా మరియు గ్రిప్పింగ్ గా ఉంటుంది..మెగాస్టార్ నట విశ్వరూపం కి ఎవరైనా ఫిదా కావాల్సిందే..ఇటీవల కాలం లో ఇంత పవర్ ఫుల్ సినిమా రాలేదు..కాబట్టి ఈ దసరా బెస్ట్ ఆప్షన్ గాడ్ ఫాదర్ మాత్రమే.
రేటింగ్: 3.5 /5