
Bigg Boss 5 Nominations: తెలుగులోనే నంబర్ 1 రియాలిటీ షో ఘనంగా ప్రారంభమైంది. కింగ్ నాగార్జున 19 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించాడు. . ఫుల్లీ ఓవర్ లోడ్ గా ఉన్న ఈ సీజన్ లో తొలిరోజు అలకలు, సంతోషాలు, గిల్లి కజ్జాలు మొదలయ్యాయి.
తొలి రోజు ఇంటి సభ్యుల మధ్య పరిచయాలు, వారి గురించి విషయాలను తెలుసుకునే పనిలో పడ్డారు. అలాగే చిన్న చిన్న చిలిపి పనులు చేస్తూ తమ మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుకునే పనిలో పడ్డారు.
ఇక రెండో రోజు కొంతమంది బిగ్ బాస్ హౌస్ లో సందడి అల్లరి చేయగా.. మరికొందరు ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉన్నారు. యూట్యూబర్ షణ్ముఖ్(Shanmukh), నటరాజ్ మాస్టర్(Natraj), నటుడు మానస్(Manas) లు ఎవరితో కలవకుండా ఒంటరిగా ఫీలవ్వడంపై ఇంటి సభ్యులు చర్చించుకున్నారు. తమకు అందరితో కలవడానికి కాస్త టైమ్ పడుతుందని వారు చెప్పుకొచ్చారు. యాంకర్ రవి(Ravi) వారికి ధైర్యం చెప్పాడు. ఇక మొదటిరోజే తన గురకతో ఇంటి సభ్యులకు నిద్రలేకుండా చేశాడు లోబో.
ఇక నిన్న రెండో ఎపిసోడ్ లో గొడవలు మొదలయ్యాయి. సాయంత్రం నామినేషన్ వాడివేడిగా సాగింది. ఫస్ట్ నామినేషన్ లోనే రచ్చ సాగింది. నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్గా సాగింది. తాము నామినేట్ చేయాలనుకున్న ప్రక్రియను చేయాలనుకున్న వారి ఫొటోలు ఉన్న చెత్త కవర్లను చెత్తకుండీలో వేసి అందుకు గల కారణాలు చెప్పి నామినేట్ చేయాలని బిగ్ బాస్ సూచించారు.
ఈ క్రమంలోనే అందరూ తమకు నచ్చని వారిని.. తమతో మాట్లాడని వారిని.. హౌస్ లో ఇబ్బందికరంగా మౌనంగా ఉన్న వారిని.. ఇక హౌస్ లో కాంపిటీటర్లను ఇలా రకరకాలుగా హౌస్ లోని సభ్యులు నామినేట్ చేసుకున్నారు. యాంకర్ రవి నుంచి షణ్ముఖ్ వరకు నామినేట్ చేశారు. ముఖ్యంగా జెస్సీ , హమీదాలు నామినేషన్ ప్రక్రియలో అందరూ తమను టార్గెట్ చేయడం.. సిల్లీ కారణాలు చెప్పడంపై ఏడ్చేశారు.
మొదటి వారం నామినేషన్ ప్రక్రియలో అత్యధిక మంది నామినేట్ చేసిన ఆరుగురిని తొలి వారం నామినేషన్ కు బిగ్ బాస్ ఎంపిక చేశారు. అందులో యాంకర్ రవి, మానస్, సరయు, కాజల్, హమీదా, జెస్సీలు నామినేట్ అయ్యారు. ఈ ఆరుగురిలో ఒకరు తొలి వారం నామినేట్ కానున్నారు.
