Akkineni Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు నాగార్జున… కెరీర్ మొదట్లో రొమాంటిక్ సినిమాలు చేసిన ఆయన ఆ తర్వాత క్లాస్ మాస్ అనే తేడా లేకుండా డిఫరెంట్ సినిమాలను చేస్తు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం తన వందో సినిమా విషయంలో ఎలాగైనా సరే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఇక ఇదిలా ఉంటే నాగార్జున కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా కొంతమంది దర్శకులను తన వెంట తిప్పుకొని మరి వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా రిజెక్ట్ చేశారట.
కారణం ఏంటంటే నాగార్జున తనకు మంచి కథని చెప్పమని కొంతమంది దర్శకులకు ఆఫర్ అయితే ఇచ్చాడట. వాళ్ళు కథ లైన్ తో ఇంప్రెస్ చేసినప్పటికి మొత్తం స్టోరీని డెవలప్ చేయడంలో చాలావరకు డిసప్పాయింట్మెంట్ ని చూపించారట. కథ ఏమాత్రం కూడా ఆ లైన్ కి అనుసంధానంగా ఉండకపోవడంతో ఆ స్టోరీ నాగార్జునకు నచ్చకపోవడం వల్ల ఆ దర్శకులను రిజెక్ట్ చేసారట.
ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగార్జునకి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. నాగార్జున సీనియర్ హీరోలతో పోటీపడుతూ టాప్ పొజిషన్లో ముందుకు దూసుకెళ్తున్నాడు. అలాంటి నాగార్జున శతమానం భవతి మూవీ ఫేమ్ సతీష్ వేగేశ్న, అలాగే ప్రస్థానం మూవీ ఫేమ్ దేవకట్ట లాంటి దర్శకులతో సినిమాలు చేస్తానని చెప్పి లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చాడట…
ఇక ఏది ఏమైనా కూడా స్టార్ హీరోలందరు సక్సెస్ ఫుల్ సినిమాలను అందించే దర్శకులకు అవకాశం ఇస్తారు. ముందుగా కథల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అలాగే దర్శకులను ఏరికోరి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఇక ఈ దర్శకులు చెప్పిన కథ నాగార్జున కి నచ్చలేదా లేదంటే వాళ్ళు చెప్పిన స్టోరీ బాగున్నప్పటికి దాన్ని స్క్రీన్ మీద అంత ఎఫెక్టివ్ గా ప్రాజెక్ట్ చేయలేరని పక్కన పెట్టేసాడా అనే విషయం తెలియదు కానీ మొత్తానికైతే నాగార్జున ఈ దర్శకులను పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది…
