https://oktelugu.com/

Nagarjuna: నాగార్జున నిర్లక్ష్యం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది !

Nagarjuna: భార‌త క్రికెట్ చరిత్ర‌లో ఎప్పటికి మర్చిపోలేని సంవత్సరం ‘1983’. కపిల్ దేవ్ బయోపిక్ గా రాబోతున్న ఈ ’83’ సినిమాలో 1983 నాటి ఇండియా వరల్డ్ కప్ ను గెలుచుకున్న క్రమాన్ని, అలాగే కపిల్ దేవ్ జీవిత గమనం, ఆయన సాధించిన విజయాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. కంటెంట్ పరంగా ఇది భారీ పాన్ ఇండియా సినిమా అనుకోవచ్చు. అలాంటి ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది. కానీ, ఎవరూ పట్టించుకున్నట్లు లేరు. భార‌త్ మొదటి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 23, 2021 7:16 pm
    Follow us on

    Nagarjuna: భార‌త క్రికెట్ చరిత్ర‌లో ఎప్పటికి మర్చిపోలేని సంవత్సరం ‘1983’. కపిల్ దేవ్ బయోపిక్ గా రాబోతున్న ఈ ’83’ సినిమాలో 1983 నాటి ఇండియా వరల్డ్ కప్ ను గెలుచుకున్న క్రమాన్ని, అలాగే కపిల్ దేవ్ జీవిత గమనం, ఆయన సాధించిన విజయాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. కంటెంట్ పరంగా ఇది భారీ పాన్ ఇండియా సినిమా అనుకోవచ్చు. అలాంటి ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది. కానీ, ఎవరూ పట్టించుకున్నట్లు లేరు.

    83 Movie

    83 Movie

    భార‌త్ మొదటి ప్ర‌పంచ‌ క‌ప్ ప్ర‌యాణానికి సంబంధించిన క‌థతో వస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగులో అన్న‌పూర్ణ స్టూడియోస్ పై నాగార్జున విడుద‌ల చేస్తున్నాడు. నాగార్జున లాంటి సీనియర్ కూడా ప్ర‌మోష‌న్ల ప‌రంగా ఎలాంటి జాగ్ర‌త్తలు తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తెలుగులోనూ ఈ సినిమాకి మంచి కలెక్షన్లు వస్తాయి. అయినా ఎందుకో నాగ్ మాత్రం ఈ సినిమాను లైట్ తీసుకున్నాడు.

    పైగా ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌కు సుమంత్ డ‌బ్బింగ్ చెప్పాడు. ఎలాగూ క్రికెట్ నేప‌థ్యంలో సాగే గ్రేట్ క‌థ. కచ్చితంగా ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా చూపిస్తారు. కానీ ఒక్క ప్ర‌మోష‌న్ ఈవెంట్ కూడా హైద‌రాబాద్ లో ప్లాన్ చేయకపోవడం కచ్చితంగా సినిమాకు అన్యాయం చేయడమే. అయితే, రేపు రిలీజ్ పెట్టుకుని ఈ రోజు ఓ ఈవెంట్ పెట్టారు.

    అసలు ఒక్క రోజు వ్య‌వ‌ధిలో ఈవెంట్ చేస్తే ఏమిటి ? చేయకపోతే ఏమిటి ? అయినా ప్ర‌మోష‌న్ల విష‌యంలో జాగ్ర‌త్తలు తీసుకోకుండా హిట్ అవుతుందని ఎలా అనుకున్నారు ? హిట్ అయినా కలెక్షన్స్ అండ్ ఓపెనింగ్స్ ఎలా వస్తాయి ? ఏది ఏమైనా ఈ సినిమా కోసం కపిల్ ఫ్యాన్స్ మాత్రం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

    కపిల్ ఎందుకు రిటైర్ తర్వాత పెద్దగా తన ప్రభావాన్ని చూపలేకపోయాడు..? ఇండియా క్రికెట్ వ్యవస్థలో తనకంటూ ఏమి లేకుండా ఎందుకు మిగిలిపోయాడు ? అనే అంశాల కోసం ఎంతో ఆసక్తిగా ఉన్నారు. మరి ఆ అంశాలు సినిమాలో ఉంటాయో ఉండవో చూడాలి.

    Also Read: Aha: ‘ఆహా’ కోసం వంశీ పైడిపల్లి, సుక్కు వెబ్ సిరీస్ లు !

    ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. 1983వ ఏడాది సువ‌ర్ణాధ్యాయంగా చరిత్రలో, భవిష్యత్తులో శాశ్వతంగా నిలిచిపోతుంది. అవును, ప్ర‌పంచ క్రికెట్ కి కొత్త ఛాంపియ‌న్స్ ను పరిచయం చేసిన సంవత్సరం అది.

    Also Read: Nani: నాని వ్యాఖ్యల వల్ల స్టార్ హీరోలకే ఇబ్బంది !

    Tags