Akkineni Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలన్నీ యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప గుర్తింపును సంపాదించుకున్నావే కావడం విశేషం…ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రానీ గుర్తింపు ఆయన కొన్ని సినిమాలతో తెచ్చుకున్నాడు. ఇక అలాంటి నాగార్జున ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఆయన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇక ఇదిలా ఉంటే ఆయన అనుకున్నట్టుగానే ఇకమీదట కూడా ఆయన చేయబోతున్న సినిమాలు ఆయనకి ఏ రేంజ్ సక్సెస్ లను కట్టబెడతాయి. తనదైన రీతిలో సత్తా చాటుకునే విధంగా ఆయన గొప్ప విజయాలను సాధిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
ఇక నాగార్జున తన ఎంటైర్ కెరియర్ లో చేసిన చాలా సినిమాలు అతనికి మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకొచ్చాయి. మొత్తానికైతే ఆయన ఒక రెండు సినిమాలను వదులుకొని చాలా వరకు బాధపడ్డాడనే విషయాన్ని ఆయన స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏంటంటే అందులో వెంకటేష్ హీరోగా చేసిన ‘రాజా’ సినిమా ఒకటి కావడం విశేషం…
మొదట ఈ సినిమాని నాగార్జున తో చేయాలని అనుకున్నారట. కానీ అప్పుడు నాగార్జున బిజీగా ఉండడం వల్ల ఆ సినిమాని వదిలేసుకున్నాడు… అలాగే వెంకటేష్ హీరోగా విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాని సైతం మొదట నాగార్జున తోనే చేయాలనుకున్నారట. ఆ సినిమా కథ ఆయనకి అంత పెద్దగా నచ్చకపోవడంతో దానిని రిజెక్ట్ చేశాడు.
ఇక తర్వాత విజయభాస్కర్ దర్శకత్వంలో నాగార్జున ‘మన్మధుడు’ సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. మొత్తానికైతే నాగార్జున చేయాల్సిన రెండు సినిమాలను వెంకటేష్ చేసి సూపర్ సక్సెస్ లను సాధించాడు… ఇక ఈ విషయాన్ని నాగార్జున చాలా సందర్భాల్లో గుర్తుచేసుకొని బాధ పడుతుంటాడని వాళ్ల సన్నిహితులు తెలియజేస్తుండటం విశేషం…