Nagarjuna Meeting CM Revanth Reddy : అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ఈమధ్య కాలం లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ని తెగ కలుస్తున్నాడు. వాస్తవానికి అక్కినేని ఫ్యామిలీ ని కాంగ్రెస్ పార్టీ నాయకులూ అవమానించిన తీరుకు, అదే విధంగా నాగార్జున N కన్వెన్షన్ మాల్ ని కూల్చివేసిన ఘటనకు జీవితం లో నాగార్జున మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి ని కలవడం కష్టమేమో అని ఆయన అభిమానులు అనుకున్నారు. ఈ ఘటనలు జరిగిన తర్వాత ఇప్పటి వరకు వేర్వేరు సందర్భాల్లో నాగార్జున సీఎం రేవంత్ రెడ్డి ని మూడు సార్లు కలిసాడు. ఒకసారి సినీ పెద్దలతో కలిసి చర్చకు వెళ్ళాడు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ని ప్రత్యేకంగా సన్మానించాడు కూడా. ఇక రీసెంట్ గానే మిస్ వరల్డ్ పోటీలను వీక్షించేందుకు వేసిన నాగార్జున సీఎం రేవంత్ రెడ్డి పక్కన కూర్చున్నాడు. ఇక ఈరోజు తన సతీమణి అమల తో కలిసి మూడవసారి రేవంత్ రెడ్డి కి కలిశాడు.
అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈరోజు కలవడానికి ముఖ్య కారణం తన చిన్న కొడుకు అక్కినేని అఖిల్ పెళ్లి కి ఆహ్వానం అందించడం కోసం అని తెలుస్తుంది. గత ఏడాది నవంబర్ 26 న అక్కినేని అఖిల్(Akkineni Akhil), జైనబ్(Zainab) జంట నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. వచ్చే నెల 6వ తేదీన ఈ జంట పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో అట్టహాసం గా జరగబోతుంది. ఈ వివాహమహోత్సవానికి నాగార్జున దంపతులు సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ప్రముఖ రాజకీయ నాయకులూ, సినీ ప్రముఖులను కూడా ఆహ్వానించాడు. గత ఏడాది డిసెంబర్ లో పెద్ద కొడుకు నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) కి శోభిత(Sobhita Dhulipala) తో రెండవ పెళ్లి చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ ఏడాది తన చిన్న కొడుక్కి కూడా పెళ్లి చేసి తన జీవితంలోని ముఖ్యమైన బాధ్యతలను తీర్చుకోనున్నాడు నాగార్జున.
Also Read : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన హీరో నాగార్జున
ఇదంతా పక్కన పెడితే సినిమాల పరంగా కూడా అక్కినేని ఫ్యామిలీ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ ఏడాది ప్రారంభం లో తండేల్ చిత్రం తో భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్న అక్కినేని ఫ్యాన్స్, ద్వితీయార్థం లో నాగార్జున ప్రధాన పాత్రలు పోషించిన ‘కూలీ’, ‘కుబేర’ చిత్రాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రెండు సినిమాలు కచ్చితంగా హిట్ అవుతాయని, నాగార్జున కం బ్యాక్ భారీ రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది. ఈ రెండు చిత్రాల్లోనూ ఆయన నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నాడట. ముఖ్యంగా ‘కూలీ’ చిత్రం లో ఆయన పాత్ర అత్యంత శక్తివంతంగా ఉంటుందట. ఇక నాగ చైతన్య విషయానికి వస్తే ‘విరూపాక్ష’ డైరెక్టర్ కార్తీక్ తో ఒక మిస్టిక్ థ్రిల్లర్ ని చేస్తున్నాడు. అఖిల్ ‘లెనిన్’ అనే చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. ఇలా ప్రస్తుతం అక్కినేని కాంపౌండ్ లో సినిమాలన్నీ మినిమం గ్యారంటీ అనే రేంజ్ లో ఉన్నాయి.