Lal Salaam to hit OTT : ప్రతీ సూపర్ స్టార్ కెరీర్ లో డిజాస్టర్ ఫ్లాప్స్ ఉన్నట్టుగానే, రజనీకాంత్(Superstar Rajinikanth) కెరీర్ లో కూడా కొన్ని డిజాస్టర్ ఫ్లాప్స్ ఉన్నాయి. కానీ ఆయనకీ ఉన్న స్టార్ స్టేటస్ కారణంగా కనీసం ఆ డిజాస్టర్ ఫ్లాప్స్ కి ఓపెనింగ్ వసూళ్లు అయినా వచ్చేవి. కానీ అలా కాకుండా అటు ఓపెనింగ్స్ పరంగా, ఇటు క్లోజింగ్ పరంగా రజినీకాంత్ స్టార్ ఇమేజ్ కి ఘోరమైన అవమానం చేసిన సినిమా ఒకటి ఉంది. ఆ సినిమానే ‘లాల్ సలామ్'(Lal Salaam). విష్ణు కౌశల్(Vishnu Vishal), విక్రాంత్ సంతోష్(Vikranth Santhosh) హీరోలుగా నటించిన ఈ చిత్రంలో రజినీకాంత్ ఒక కీలక పాత్ర పోషించాడు. ఆ పాత్ర నిడివి దాదాపుగా 50 నిమిషాలకు పైగానే ఉంటుంది. ‘జైలర్’ లాంటి సంచలన విజయం తర్వాత వస్తున్న సినిమా కావడంతో మార్కెట్ లో ఈ చిత్రానికి పెద్దగా క్రేజ్ లేకపోయినా, రజినీకాంత్ ఇమేజ్ కారణంగా కనీసం ఓపెనింగ్స్ అయినా వస్తుందని అనుకున్నారు.
అలాంటి మినిమం అంచనాలతో ఈ చిత్రం గత ఏడాది ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి కనీస స్థాయి ఓపెనింగ్ వసూళ్లు కూడా రాలేదు. రెండు భాషలకు కలిపి ఫుల్ రన్ లో కనీసం 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదంటే ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రానికి రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించింది. అయితే ఈ సినిమా విడుదలై 16 నెలలు పూర్తి అయినా ఇప్పటికీ ఓటీటీ లో ఎందుకు రాలేదు అని రజినీకాంత్ అభిమానులు మేకర్స్ ని ట్యాగ్ చేసి అడగని రోజు లేదు. ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ముందుగా ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది.
Also Read : లాల్ సలామ్ మూవీ ఫుల్ రివ్యూ…
కానీ సినిమా ఊహించని రేంజ్ లో డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడంతో నెట్ ఫ్లిక్స్ సంస్థ మేకర్స్ అడిగినంత డబ్బులు ఇవ్వడానికి కుదరదని చెప్పుకొచ్చిందట. దీంతో ఇన్ని రోజులు ఈ సినిమా ఓటీటీ విడుదలకు బ్రేక్ పడింది. ఇప్పుడు సన్ నెక్స్ట్ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేసింది. జూన్ 6వ తేదీన ఈ చిత్రం సన్ నెక్స్ట్ ఓటీటీ యాప్ లో విడుదల కాబోతున్నట్టు రీసెంట్ గానే అధికారిక ప్రకటన చేశారు. రజినీకాంత్ చిత్రం ఓటీటీ రైట్స్ ఒక సంస్థ చేతుల్లో నుండి మరొక సంస్థ చేతుల్లోకి వెళ్లడం అంటే ఎంత ఘోరమైన అవమానమో అర్థం చేసుకోవచ్చు. థియేటర్స్ లో ఇంతటి ఘోరమైన ఫలితాన్ని ఎదురుకున్న ఈ చిత్రం కనీసం ఓటీటీ లో అయినా ఆదరణ దక్కించుకుంటుందో లేదో చూద్దాము.