Nagarjuna invited Chandrababu : రేపు అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) చిన్న కొడుకు అక్కినేని అఖిల్(Akkineni Akhil), జైనబ్ జంట వివాహం జరగనుంది. గత ఏడాది డిసెంబర్ నెలలో అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya), శోభిత(Sobhita Dhulipala) జంటలకు వివాహం జరిపించిన నాగార్జున, రేపు తన చిన్న కొడుక్కి కూడా పెళ్లి చేసి తండ్రిగా తన బాధ్యతల నుండి విముక్తి కానున్నాడు. ఈ వివాహానికి నాగార్జున ప్రత్యేకంగా సినీ, రాజకీయ నాయకులను స్వయంగా కలిసి ఆహ్వాన పత్రికని అందించిన సంగతి తెలిసిందే. ముందుగా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డ్ ని అమలతో జంటగా కలిసి వెళ్లి ఆహ్వాన పత్రిక ని అందించాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇక రీసెంట్ గా ఆయన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ని కూడా కలిసి ఆహ్వాన పత్రిక ని అందించాడు.
Also Read : హీరో విశాల్ కి ఊహించని షాక్ ఇచ్చిన కోర్టు..21 కోట్లు చెల్లించాల్సిందేనా!
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ని ఎందుకు ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించలేదు అనే వాదన ప్రస్తుతం సోషల్ మీడియా లో వినిపిస్తుంది. సినీ ఇండస్ట్రీ నుండి రాజకీయాల్లోకి వెళ్లి సక్సెస్ సాధించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఆ అరుదైన సంఘటన పవన్ కళ్యాణ్ విషయం లో జరిగింది. ఒక సినీ ఇండస్ట్రీ కి చెందిన సూపర్ స్టార్ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి హోదా లో కూర్చున్నప్పుడు ఆయనకు కూడా సరైన మర్యాద ఇవ్వాలి కదా, ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక ఇచ్చినప్పుడు ఉప ముఖ్యమంత్రికి ఎందుకు ఇవ్వలేదు?, నాగార్జున కి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉండదా?, ఆయన మాజీ సీఎం జగన్ కి అత్యంత ఆప్త మిత్రుడు కాబట్టి, జగన్ కి పవన్ కళ్యాణ్ పూర్తిగా వ్యతిరేకం కాబట్టి ఆయన్ని కావాలని ఉద్దేశపూర్వకంగానే ఆహ్వానించలేదా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
నాగార్జున కి చిరంజీవి అత్యంత సన్నిహితుడు. రామ్ చరణ్ ని కూడా తన సొంత కొడుకులాగానే చూస్తాడు. ఎన్నో సందర్భాల్లో చిరంజీవి మీద తనకు ఉన్న అభిమానాన్ని చాటి చెప్పాడు కూడా. అలాంటి నాగార్జున కి అదే చిరంజీవి కుటుంబానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ తో ఎందుకు కనెక్షన్ లేదు?, వీళ్ళ మధ్య గతంలో ఏదైనా కోల్డ్ వార్ నడిచిందా?, ఇలా ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కొంతమంది అక్కినేని అభిమానులు వినిపించే వాదన ఏమిటంటే, నాగార్జున గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించడానికి కూడా వెళ్లాడని, కానీ ఆయన ముంబై లో ‘ఓజీ’ మూవీ షూటింగ్ తో ఫుల్ బిజీ గా ఉన్నాడని, అందుకే కలవలేకపోయాడని అంటున్నారు. ఇందులో ఎంత వరకు నిజం ఉందొ తెలియదు కానీ, నాగార్జున కు పవన్ కళ్యాణ్ కు మధ్య చిన్నపాటి గ్యాప్ ఉంది అనేది మాత్రం వాస్తవమని అంటున్నారు విశ్లేషకులు.