Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు 7 ఒక సక్సెస్ ఫుల్ రియాలిటీ షో . అతి తక్కువ సమయంలోనే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సంపాదించింది . దేశంలోనే నెంబర్ వన్ షో గా పేరు సాధించింది . బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పుడు మూడు వారాలు పూర్తి చేసుకుంది . ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు . చూస్తూ చూస్తూనే నాలుగో వీకెండ్ కూడా వచ్చింది. వీకెండ్ ఎపిసోడ్ అంటే నాగార్జున ఎంట్రీ ఇస్తాడు. కంటెస్టెంట్స్ తో కలిసి సందడి చేస్తాడు .
నాగార్జున బెల్ట్ తీసుకుని ఫుల్ ఫైర్ మీద వచ్చాడు . రావడం తోనే సందీప్ నువ్వేమైనా బ్లైండ్ ఆ ,శివాజీ కెమెరా లో నుండి ఏం జరుగుతుందో నీకు కనపడలేదా అంటూ వీడియోలు వేసి చూపించాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసు కదా ఆపాల్సిన బాధ్యత మీకు లేదా అని నాగార్జున అనగా, నేను కావాలని చేయలేదు సర్ అని శివాజీ చెప్పాడు . నువ్వు కావాలని చేసావా లేదా అని నువ్వు కాదు మేము డిసైడ్ చేస్తాం అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు నాగ్ .
సందీప్ నువ్వు సంచాలక్ గా కంప్లీట్ ఫెయిల్ అయ్యావు అనగానే సారీ సర్ అంటూ భయంతో వణికిపోయాడు సందీప్ . ఆంధా బైరాగ్ తేజా అంటూ… తేజా ని నిలబెట్టి ఏం జరుగుతుంది చూసావు గా ,ఒక పక్క ఆడపిల్లలు అరుస్తున్నారు. అయినా నీకు తెలియలేదా అని నాగార్జున ప్రశ్నించగానే ,ఎంకరేజ్మెంట్ అనుకున్నా సర్ అని బదులిచ్చాడు తేజ.
ఎంకరేజ్మెంట్ అనుకున్నావా ,మీరు ఎంకరేజ్ చేశారా తేజ ని అని శోభా ని నాగార్జున అడిగాడు ,లేదు సార్ మేము కొట్టొద్దు అని అన్నాము అంటూ బదులిచ్చారు . నువ్వు గౌతమ్ బాక్స్ నుండి బయటకు వచ్చాక వదిలేసావ్ రియలైజ్ అయ్యి కాదు అంటూ తేజ కి ఇచ్చి పడేసాడు .
సార్ తప్పైపోయింది మీరు ఆ శిక్ష వేసిన భరిస్తాను ,నన్ను క్షమించండి అని ప్రాధేయపడ్డాడు తేజ. తేజ కి ఏం శిక్ష వేద్దాం అని శుభ శ్రీ ,ప్రియాంక ని అడుగుతాడు హోస్ట్ నాగార్జున . శుభ శ్రీ జైలు బెటర్ సార్ అంటే ప్రియాంక మాత్రం జైలు సరిపోదేమో సార్ అంటుంది . సందీప్ నువ్వు చెప్పు అనగానే ఏకంగా ఇంటికి పంపించాలి అని చెప్పాడు సందీప్ .ఇది వినగానే బాధ తట్టుకోలేక బోరున ఏడ్చేశాడు తేజ .
Nagarjuna leaves contestants in awe as he exposes their mistakes with video proof during task completion. Watch as the contestants are left speechless! Don’t miss the thrilling moments on #StarMaa #BiggBossTelugu7 @iamnagarjuna @DisneyPlusHSTel https://t.co/G0GvgncaIO
— Starmaa (@StarMaa) September 30, 2023