Nagarjuna – Bigg Boss 6 Telugu: భారీ అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 ఇటీవలే గ్రాండ్ ఫినాలే తో ఘనంగా ముగిసింది..టైటిల్ విన్నర్ గా రేవంత్ మరియు రన్నర్ గా శ్రీహాన్ నిలిచారు..ఆద్యంతం ట్విస్టులతో ఆసక్తికరమైన టాస్కులతో ఈ సీజన్ నడిచినా చివరికి ఫ్లాప్ షో గానే మిగిలింది..అందుకు కారణం ప్రేక్షకుల ఓటింగ్ ని బట్టి ఒక్క ఎలిమినేషన్ కూడా ఈ సీజన్ లో జరగకపోవడమే.

బిగ్ బాస్ తనకి ఇష్టమొచ్చిన కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేసాడని..ఇలాంటి చెత్త సీజన్ ని ఇప్పటి వరుకు ఎప్పుడూ కూడా చూడలేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు..కేవలం ప్రేక్షకులకు మాత్రమే కాదు, ఈ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున కూడా నిరాశతో కూడిన అసహనం తో ఉన్నాడట..బిగ్ బాస్ టీం పై విరుచుకుపడుతున్నాడట..ఇక మీదట ఈ షో చెయ్యనని వాళ్ళ మొహం మీదనే చెప్పేశాడట నాగార్జున..ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.
ముఖ్యంగా ఈ షో కి డైరెక్టర్ పై నాగార్జున చాలా సీరియస్ అయ్యినట్టు తెలుస్తుంది..ఇక అసలు విషయానికి వస్తే గత సీజన్స్ లో వీకెండ్స్ లో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది తెలిసిపొయ్యేది..ఎందుకంటే సోషల్ మీడియా లో వచ్చే అనధికారిక ఓటింగ్ లో ఎవరైతే చివరి స్థానానికి పరిమితమవుతారో, వాళ్ళే ఎలిమినేట్ అవ్వడం జరుగుతూ ఉండేది..ఇది గమనించిన బిగ్ బాస్ టీం, ప్రేక్షకులకు అన్నీ తెలిసిపోతుందని తెలిసి వాళ్ళ అంచనాలకు బిన్నంగా ఎలిమినేషన్స్ చెయ్యడం ప్రారంబించాడు.

అది బాగా మిస్ ఫైర్ అయ్యింది..ఫలితంగా ఈ షో ని చూసే వారి సంఖ్య వారం వారం కి తగ్గిపోతూ వచ్చింది..చివరికి ఫ్లాప్ షో గా మిగిలింది..నాగార్జున అలా చెయ్యొద్దు అని డైరెక్టర్ కి చెప్తున్నా కూడా అతను వినకపోవడం పై ఆయన చాలా ఫైర్ అయ్యాడట..ఇక మీదట అతను ఉంటే నేను షో చేసే సమస్యే లేదని బిగ్ బాస్ టీం కి నాగార్జున చాలా గట్టిగా చెప్పాడట.