Akhil Lenin Movie Release Date: ప్రస్తుతం మన టాలీవుడ్ లో అభిమానుల్లో , ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం ‘పెద్ది'(Peddi Movie). ఎన్ని సార్లు విడుదల తేదీని మార్చినప్పటికీ, ఈ చిత్రం పై అంచనాలు తగ్గడం లేదు , పెరుగుతూనే ఉన్నాయి. ‘రంగస్థలం’ చిత్రం తర్వాత #RRR కాకుండా, రామ్ చరణ్(Global Star Ram Charan) సినిమా పై ప్రేక్షకుల్లో ఈ స్థాయి అంచనాలు ఏర్పడడం జరగలేదు. ఈ చిత్రం నుండి ఏ చిన్న కంటెంట్ బయటకు వచ్చినా విస్ఫోటనం లాగా పేలింది. ఇలాంటి సినిమాకు ఎవ్వరైనా పోటీ కి వచ్చే సాహసం చేస్తారా?, కానీ అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) చేస్తున్నాడు. ఆయన నిర్మాతగా తన రెండవ కొడుకు అక్కినేని అఖిల్(Akkineni Akhil) ని పెట్టి ‘లెనిన్'(Lenin Movie) అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రానికి నాగవంశీ కూడా సహా నిర్మాతగా వ్యవహరించాడు. ముందుగా ఈ చిత్రాన్ని మే 1 న , అనగా నేడు విడుదల చేద్దామని అనుకున్నారు.
కానీ ఏప్రిల్ 30 న ‘పెద్ది’ చిత్రం విడుదల అవుతుంది కాబట్టి, రామ్ చరణ్ – అఖిల్ మధ్య ఉన్న గొప్ప అనుబంధానికి విలువని ఇస్తూ , ‘లెనిన్’ చిత్రాన్ని జూన్ 26 కి వాయిదా వేశారు. కానీ ‘పెద్ది’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో ఈ చిత్రాన్ని కూడా జూన్ 25 కి వాయిదా వేశారు. నాగార్జున మళ్లీ వెనక్కి తగ్గుతాడేమో అని అంతా అనుకున్నారు. కానీ అలాంటిది ఏమి జరగడం లేదు, ఎవరొచ్చినా పర్వాలేదు , ఈసారి వెనక్కి తగ్గేదే లేదు, ఎట్టి పరిస్థితి లో ఈ సినిమాని 26 న విడుదల చేయబోతున్నాము, అఖిల్ కెరీర్ లోనే ది బెస్ట్ చిత్రమిది, రాసి పెట్టుకోండి , పోటీ కి వస్తే మీకే రిస్క్ అన్నట్టుగా నాగార్జున పరోక్షంగా ‘పెద్ది’ టీం కి వార్నింగ్ ఇస్తున్నట్టు రీసెంట్ గా వేసిన ఒక ట్వీట్ పెద్ద దుమారమే రేపింది.
ఈ ట్వీట్ పై మెగా అభిమానులు కూడా మండిపడ్డారు, నాగార్జున కి ఇంత నమ్మకం ఏంటి?, ఆయన లో ఈ స్థాయి నమ్మకాన్ని చూసి ఏళ్ళు అయిపోయింది. అభిమానులు అయితే ‘ఏజెంట్’ చిత్రం తోనే అఖిల్ పై ఆశలు పూర్తి గా వదిలేసుకున్నారు. కానీ ‘లెనిన్’ విషయంలో నాగార్జున నమ్మకాన్ని చూస్తుంటే, ఆయన కెరీర్ లో ‘శివ’ చిత్రం ఎలా అయితే ల్యాండ్ మార్క్ గా నిల్చి నాగార్జున ని స్టార్ ని చేసిందో, ‘లెనిన్’ కూడా అఖిల్ కెరీర్ లో అలాంటి ల్యాండ్ మార్క్ గా నిలుస్తుందని బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ఆ రేంజ్ లో ఉంటుందో లేదో చూడాలి. ఇకపోతే ‘పెద్ది’ చిత్రాన్ని జూన్ 25 న కాకుండా, జూన్ 4 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం, నేడు ఈ విషయాన్నిమేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.