Ghost Movie Pre-Release Event: ప్రతి సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద మన టాలీవుడ్ టాప్ హీరోలు పోటీ పడడం సహజం..సంక్రాంతి వస్తుందంటే చాలు మూవీ లవర్స్ కి పండగే..సంక్రాంతి తర్వాత ఆ రేంజ్ లో సినిమాలు విడుదల అయ్యేది దసరాకి..ఇది కూడా టాలీవుడ్ కి మంచి సీసన్..ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా దసరా బాక్స్ ఆఫీస్ పోరు ఆసక్తికరం గా ఉండబోతుంది..ఈ అక్టోబర్ 5 వ తేదీన మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్..అక్కినేని నాగార్జున ఘోస్ట్ మరియు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు హీరో గా పరిచయం అవుతూ తెరకెక్కిన ‘స్వాతిముత్యం’ వంటి సినిమాలు వస్తున్నాయి..ఇన్ని దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ లో చిరంజీవి మరియు నాగార్జున సినిమాలు ఒకే రోజు విడుదల అయినవి లేవు..మొట్టమొదటిసారి అలాంటి అరుదైన ఘట్టం చోటు చేసుకోబోతుంది..ఈ పోరులో ఎవరు గెలవబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది..ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన టీజర్స్ విడుదల అవ్వగా దానికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఇక నిన్ననే నాగార్జున గారి ఘోస్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది..ఈ ఈవెంట్ లో నాగార్జున గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న కర్నూల్ లో ఘనంగా జరుగగా జనాలు వేలాది సంఖ్యలో హాజరు అయ్యారు..ఈ ఈవెంట్ కి నాగార్జున తో పాటు ఆయన కుమారులు అక్కినేని అఖిల్ మరియు నాగ చైతన్య కూడా హాజరయ్యారు..ఇందులో నాగార్జున తన స్పీచ్ చివర్లో చిరంజీవి గారి గాడ్ ఫాదర్ ని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు మెగా అభిమానులను బాగా ఆకట్టుకుంది..ఆయన మాట్లాడుతూ ‘మీ అందరికి తెలిసిందే..ఇండస్ట్రీ లో నాకు సోదరుడు..అత్యంత ఆప్త మిత్రుడు చిరంజీవి గారు..ఆయన సినిమా కూడా అక్టోబర్ 5 వ తేదీన విడుదల కాబోతుంది..ఆయనకీ అడ్డు రావాలని నాకు ఇష్టం లేదు..కానీ టీం మొత్తం తీసుకున్న నిర్ణయం కాబట్టి చిరంజీవి గారి సినిమాతో పోటీ పడక తప్పడం లేదు..నన్ను అందుకు క్షమించాలి..కానీ కచ్చితంగా మా రెండు సినిమాలు భారీ ఘన విజయం సాధిస్తుంది అనే నమ్మకం ఉంది..తెలుగు సినిమా వర్థిలాలి..గాడ్ ఫాదర్ టీం కి అల్ ది బెస్ట్ చెప్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున..చిరంజీవి మరియు నాగార్జున గారి ఎంత మంచి స్నేహితులు అనే విషయం మనకి కూడా బాగా తెలుసు..వాళ్ళ సినిమాలు క్లాష్ కి వస్తున్నా కూడా ఇంత స్నేహపూర్వక వాతావరణం మైంటైన్ చెయ్యడం మాములు విషయం కాదు..ఈ తరం హీరోలు కూడా వీళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకోవాలి.
