Nagarjuna 100th movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే… ఇక అక్కినేని ఫ్యామిలీ రెండోవ తరం బాధ్యతలను ముందుకు తీసుకెళ్లిన నాగార్జున అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఒకానొక సందర్భంలో నాగార్జున సినిమా ఇండస్ట్రీకి పనికిరాడు అని చెప్పిన వాళ్ళు సైతం ఆ తర్వాత నాగార్జున(Nagarjuna) నటనకి ఫిదా అయిపోయి ఆయన చేసిన సక్సెస్ ఫుల్ సినిమాలకు సలాం చేశారు. మొత్తానికైతే నాగార్జున 65 సంవత్సరాలకు పైన ఉన్నప్పటికి ఈ ఏజ్ లో కూడా ఎక్కడా ఎవరికీ తగ్గకుండా మంచి క్యారెక్టర్ లను సెలెక్ట్ చేసుకుంటూ సినిమాలను చేస్తూ సక్సెస్ ఫుల్ నటుడిగా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన లోకేష్ కనకరాజు(Lokesh Kanakaraju) దర్శకత్వంలో కూలీ అనే సినిమాలో విలన్ గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక తన 100 వ సినిమాని కూడా తొందర్లోనే స్టార్ట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు నాగార్జున చేసిన సినిమాలు ఒకెత్తయితే తన వందో సినిమా మాత్రం మరొక ఎత్తుగా మారబోతుంది. ఇండస్ట్రీలో ఎవ్వరికీ దక్కనటువంటి గొప్ప గుర్తింపు సంపాదించుకోవడానికి నాగార్జున తన వందో సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించాలని చూస్తున్నాడు…
ఇక ఇప్పటికే పలువురు దర్శకులు ఈ సినిమాకి డైరెక్షన్ చేయబోతున్నారు అనే వార్తలు వినిపించినప్పటికి నాగార్జున మాత్రం ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే నాగార్జునతో అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమా చేసే అవకాశమైతే ఉంది.
ఇక నాగార్జున చేయబోయే 100వ సినిమా అవుతుందా? లేదంటే 101వ సినిమా అవుతుందా?అనేది తెలియదు కానీ అనిల్ రావిపూడి తో సినిమా చేయడానికి నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి చిరంజీవి తో ఒక సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే నాగార్జున వందో సినిమాని డైరెక్షన్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. మరి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో అనిల్ రావిపూడి ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడు. తద్వారా ఈ సినిమా వల్ల ఎలాంటి ఐడెంటిటిని సంపాదించుకుంటాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…