బాలకృష్ణ వర్సెస్ నాగబాబు

తాజాగా నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర దూమారం రేపుతోన్నాయి. ఇటీవల చిరంజీవి ఇంట్లో పెట్టిన సినీపెద్దల మీటింగ్ కు గానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ తో జరిగిన మీటింగ్ కు సంబంధించిగానీ తనను ఎవరు పిలువలేదని అన్నారు. టీవీల్లో, పేపర్లలోనే ఆ మీటింగులకు సంబంధించిన విషయాలు తెలిశాయని అన్నారు. అంతటితో ఆగకుండా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి భూములు పంచుకుంటున్నారా? అంటూ ఆరోపణలు చేశారు. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు తీవ్రస్థాయిలో […]

Written By: Neelambaram, Updated On : May 29, 2020 3:31 pm
Follow us on


తాజాగా నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర దూమారం రేపుతోన్నాయి. ఇటీవల చిరంజీవి ఇంట్లో పెట్టిన సినీపెద్దల మీటింగ్ కు గానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ తో జరిగిన మీటింగ్ కు సంబంధించిగానీ తనను ఎవరు పిలువలేదని అన్నారు. టీవీల్లో, పేపర్లలోనే ఆ మీటింగులకు సంబంధించిన విషయాలు తెలిశాయని అన్నారు. అంతటితో ఆగకుండా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి భూములు పంచుకుంటున్నారా? అంటూ ఆరోపణలు చేశారు. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు తీవ్రస్థాయిలో బాలకృష్ణపై మండిపడ్డారు. తన యూట్యూబ్లో ఛానల్లో ఈ విషయంపై నాగబాబు స్పందించారు.

లాక్డౌన్ కారణంగా కార్మికులను ఆదుకునేందుకు సెలబ్రెటీలంతా ముందుకొచ్చారని తెలిపారు. అయితే సినిమా షూటింగులకు ప్రారంభించేందుకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చిరంజీవి ఇంట్లో మీటింగ్ పెట్టారని చెప్పారు. అయితే ఈ మీటింగ్ బాలకృష్ణను పిలిచారా? లేదా అన్నది తనకు తెలియదని అన్నారు. అయితే బాలకృష్ణను ఎవరూ పిలువలేదని కోపగించుకోవడం సబబే అయినప్పటికీ ఆయన నోరుజారడం కరెక్ట్ కాదన్నారు. భూములు పంచుకుంటున్నారంటూ.. అందుకే కలిసారని బాలకృష్ణ అనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలోని వ్యక్తిగా తనకు బాధను కలిగించాయని నాగబాబు అన్నారు. బాలకృష్ణ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలకృష్ణ కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని నాగబాబు హితవు పలికారు.

భూములు అమ్ముకుంటున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ పై ఆరోపణలు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కూడా బాలకృష్ణ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. ఇక్కడ ఎవరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంలేదని ఒకసారి ఆంధ్రకు వెళ్లి చూస్తే టీడీపీ హయాంలో ఎవరు రియల్ వ్యాపారం చేసి సర్వనాశనం చేశారో అర్థమవుతుందన్నారు. మీరు ఇండస్ట్రీకి కింగ్ కాదని.. మీరొక హీరో మాత్రమే అంటూ నాగబాబు ఘాటుగా స్పందించారు. బాలకృష్ణ వ్యాఖ్యలకు కౌంటర్ గా నాగబాబు మాట్లాడటంతో ఈ వివాదం మరింత ముదిరేలా కన్పిస్తుంది. వీరిద్దరి వ్యాఖ్యాలతో ప్రస్తుతం టాలీవుడ్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. ఈ వివాదం మున్ముందు ఎలా మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే..!