https://oktelugu.com/

Nagababu: చిరంజీవి ‘పెదరాయుడు’ కాదు.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు

Nagababu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల చుట్టూ ఎన్ని వివాదాలు ముసురుకున్నాయో అందరికీ తెలిసిందే. మా ఎన్నికల్లో అక్రమాలు, దౌర్జన్యాలు, విద్వేషాలు చోటుచేసుకున్నాయని.. ఇంతటి సంకుచిత మనస్తత్వం గల అసోసియేషన్ లో తాను ఉండనని నాగబాబు తొలుత రాజీనామా చేసి వైదొలిగారు. ఆయన బాటలోనే ప్రకాష్ రాజ్, ఆయన ప్యానెల్ కూడా రాజీనామా చేసి ఎగ్జిట్ అయ్యారు. ఈ క్రమంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు కొద్దిసేపటి క్రితం బాధ్యతలు స్వీకరించారు. తొలి సంతకాన్ని ‘పెన్షన్ల […]

Written By: , Updated On : October 13, 2021 / 12:58 PM IST
Follow us on

Nagababu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల చుట్టూ ఎన్ని వివాదాలు ముసురుకున్నాయో అందరికీ తెలిసిందే. మా ఎన్నికల్లో అక్రమాలు, దౌర్జన్యాలు, విద్వేషాలు చోటుచేసుకున్నాయని.. ఇంతటి సంకుచిత మనస్తత్వం గల అసోసియేషన్ లో తాను ఉండనని నాగబాబు తొలుత రాజీనామా చేసి వైదొలిగారు. ఆయన బాటలోనే ప్రకాష్ రాజ్, ఆయన ప్యానెల్ కూడా రాజీనామా చేసి ఎగ్జిట్ అయ్యారు.

Nagababu

ఈ క్రమంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు కొద్దిసేపటి క్రితం బాధ్యతలు స్వీకరించారు. తొలి సంతకాన్ని ‘పెన్షన్ల ఫైలు’పై పెట్టారు. మా అసోసియేషన్ సభ్యుడి కూడా తాను కొనసాగడం లేదని నాగబాబు ప్రకటించడం.. ఇక మంచు విష్ణు మాత్రం రాజీనామాలను ఆమోదించనని స్పష్టం చేయడంతో ఈ వివాదం అనూహ్య మలుపులు తిరుగుతోంది.

ఈ క్రమంలోనే ‘మా’ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని మెగా బ్రదర్ నాగబాబు కొత్త విషయాన్ని లేవనెత్తుతున్నారు. ప్రాంతీయ వాదం, కులంతోపాటు ప్రకాష్ రాజ్ ను టార్గెట్ చేసి పర్సనల్ ఇమేజ్ ను దెబ్బకొట్టి గెలిచారని ఆడిపోసుకుంటున్నారు. అందుకే అతడికి సపోర్టుగా తాను మాట్లాడనని.. తెలుగు వాళ్లకు ప్రాంతీయ వాదం అంటగట్టిన అసోసియేషన్ లో తాను ఉండనని స్పష్టం చేశాడు. ఇంతటి సంకుచితమైన అసోసియేషన్ లో ఉండనన్నారు.మనస్థాపంతో బయటకు వచ్చేశానన్నారు.

ఇక చిరంజీవి, మోహన్ బాబు గురించి నాగబాబు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి కొనసాగాలని ఎప్పుడూ అనుకోలేదని.. పరిశ్రమకు చెందిన నటీనటులు, ఇతర వ్యక్తులు, అభిమానులు ఎవరైనా సరే కష్టమంటూ మా ఇంటికి వస్తే తనకు చేతనైంత సాయం చిరంజీవి చేశాడని నాగబాబు చెప్పుకొచ్చాడు. అంతే తప్ప పెదరాయుడిలా సింహాసనంపై కూర్చొని పెద్దరికం చలాయించాలని ఎప్పుడూ అనుకోలేన్నారు. ఆయనకు అంత అహంకారం లేదని నాగబాబు అన్నారు. పరోక్షంగా మోహన్ బాబును టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.

ఇక మరో కీలక విషయాన్ని కూడా నాగబాబు బయటపెట్టాడు. మా అసోసియేషన్ కు వ్యతిరేకంగా మరో అసోసియేషన్ పెట్టే ఆలోచన తమ కుటుంబానికి లేదని స్పష్టం చేశారు. దీంతో ‘మా’ గొడవ ఎటువైపు దారితీస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.