https://oktelugu.com/

Naresh: ముండమోపిలా ఏడుపులెందుకు? నరేశ్ మళ్లీ మొదలెట్టాడు

Naresh: మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అటు ప్రకాష్ రాజ్ వర్గం అంతా రాజీనామా చేసిన వేళ తన సగం కార్యవర్గంతో విష్ణు నడుస్తాడా? వాళ్ల రాజీనామాలను ఆమోదించరా? లేక వారి ప్లేసులో వేరే వారిని పెడుతారా? అన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై మంచు విష్ణు ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తిగా మారింది. అయితే మంచు విష్ణు కాస్త సంయమనం పాటించినా సీనియర్ నటుడు నరేశ్ మాత్రం తగ్గేది లే […]

Written By: , Updated On : October 13, 2021 / 01:18 PM IST
Follow us on

Naresh: మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అటు ప్రకాష్ రాజ్ వర్గం అంతా రాజీనామా చేసిన వేళ తన సగం కార్యవర్గంతో విష్ణు నడుస్తాడా? వాళ్ల రాజీనామాలను ఆమోదించరా? లేక వారి ప్లేసులో వేరే వారిని పెడుతారా? అన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై మంచు విష్ణు ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తిగా మారింది.

Naresh

అయితే మంచు విష్ణు కాస్త సంయమనం పాటించినా సీనియర్ నటుడు నరేశ్ మాత్రం తగ్గేది లే అన్నట్టుగా దూకుడుగా ముందుకెళుతున్నారు. మా ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ‘నరేశ్’ విరుచుకుపడుతున్నారు. ప్రత్యర్థులపై పదునైన విమర్శలతో చెలరేగిపోతున్నాడు. విష్ణు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్న నరేశ్ మాత్రం మళ్లీ నోరుపారేసుకున్నారు.

మంచు విష్ణు బాధ్యతలు చేపట్టిన అనంతరం జరిగిన కార్యక్రమంలో ‘మా’ మాజీ అధ్యక్షుడైన ‘నరేశ్’ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీనామాలు అంటూ గోల చేయాల్సిన అవసరం లేదని.. ఎవరూ చేయవద్దని హితవు పలికారు. అంతేకాదు.. ‘ఎన్నికలు అయిపోయాక లొల్లి చేయడం ఏంటని ప్రశ్నించారు.

‘ముండమోపిలా ఏడుపులెందుకు? అతిగే ఏడ్చేసేవాళ్లను నమ్మొద్దు’ అని నరేశ్ తాజాగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా లో ఇక పెత్తందారి వ్యవస్థ పోయి అందరం కలిసి పనిచేయాలని సూచించారు.

పరిస్థితులన్నీ కాస్త సద్దుమణిగి అంతా ఒక్కటి కావడానికి ప్రయత్నిస్తున్న వేళ నరేశ్ చేసిన ఈ ‘ముండమోపి’ వ్యాఖ్యలు సినీ ప్రముఖుల మధ్య మళ్లీ చిచ్చుపెట్టాయి. ఘాటు వ్యాఖ్యలు చేసిన నరేశ్ పై ప్రత్యర్థి వర్గం నుంచి కూడా అంతే ధీటుగా సమాధానం వస్తోంది. మరి ఈ రచ్చ మున్ముందు ఎలా సాగుతుందనేది వేచిచూడాలి.