https://oktelugu.com/

Nagababu: మెగా vs అల్లు ఫ్యామిలీ గొడవలు ఇంకా తగ్గలేదా..? అల్లు అర్జున్ పై నాగబాబు కామెంట్స్ .. వైరల్..

మెగా ఫ్యామిలీలో తమకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న నటులు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం అందరు సినిమాలతో బిజీ బిజీగా ఉంటే నాగబాబు మాత్రం వీళ్ళందరికీ ఏదైనా ఆపద వస్తే తను ముందుండి వాళ్ల గురించి మాట్లాడటం కానీ గొడవల గురించి తెలుసుకోవడం చేసి అటు వాళ్ళకి, ఇటు ఫ్యాన్స్ కి ఒక క్లారిటీ ఇవ్వడం లాంటివి చేస్తుంటాడు. అటు అన్నయ్య చిరంజీవికి, ఇటు తమ్ముడు పవన్ కళ్యాణ్ కి మధ్య వారధిలా నాగబాబు నిలబడ్డాడనే చెప్పాలి...

Written By:
  • Dharma
  • , Updated On : August 6, 2024 / 12:51 PM IST

    Allu Arjun gave a strong replay to Nagababu's comments

    Follow us on

    Nagababu: సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదట చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు స్టార్ హీరోలుగా గుర్తింపు పొందారు. ఇక వీళ్ళ తర్వాత జనరేషన్ లో రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లాంటి హీరోలు మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక వీళ్ళందరూ ఇప్పుడు తమ తమ సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నప్పటికీ ఎవరి సినిమాకి సంబంధించిన ఏదైనా ప్రమోషన్ ఈవెంట్ ఉంటే మాత్రం అందరూ ఏకమైపోతారు. ఇక రీసెంట్ గా ‘కమిటీ కుర్రాళ్ళు’ అనే సినిమాకి నిహారిక వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ లో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అయిన సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నాగబాబు, నిహారిక లు పాల్గొన్నారు…ఇక అందులో భాగంగానే నాగబాబు మాట్లాడుతూ కొంతమంది సినిమా ఇండస్ట్రీ మొత్తం మెగా ఫ్యామిలీ డామినేషన్ నడుస్తుందని కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. నిజానికి సినిమా ఇండస్ట్రీ అనేది మా అబ్బ సొత్తు కాదు, మా తాత సామ్రాజ్యం కాదు. ఇక్కడ ఎవరికీ టాలెంట్ ఉంటే వాళ్ళు నిలబడతారు.

    అలాగే అడవి శేషు లాంటి హీరో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఆయనకు ఇండస్ట్రీలో ఏ సపోర్టు లేకపోయిన కూడా ఆయన స్వ శక్తి తో ఎదుగుతున్నాడు కదా.. మన దగ్గర టాలెంట్ ఉంటే మనం ఎలాగైనా ఎదుగుతాం టాలెంట్ లేక మెగా ఫ్యామిలీ డామినేషన్ చేస్తున్నారు లేదంటే అక్కినేని, నందమూరి ఫ్యామిలీలా డామినేషన్ కొనసాగుతుందంటూ కొన్ని పుకార్లైతే పుట్టిస్తున్నారు. నిజానికి ఇండస్ట్రీ అనేది ఏ ఫ్యామిలీది కాదు ఇది అందరిదీ… టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడ ఎదగొచ్చు అని ఆయన చాలా స్ట్రాంగ్ గా చెప్పారు.

    సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ గురించి మాట్లాడుతూ వాళ్లు కూడా ఈ మధ్య డిఫరెంట్ తరహా సినిమాలను చేస్తున్నారని అలాంటి సినిమాలు చేస్తేనే ప్రేక్షకుల్లో ఐడెంటిటీ క్రియేట్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు అలాంటి సినిమాలు చేస్తున్నారని చెప్పాడు. ఇక తన కొడుకు అల్లుడు గురించి తను ఈ విధంగా పొగడటం కరెక్టేనా? అంటూనే అయిన ఇప్పుడు మన డబ్బా మనమే కొట్టుకోవాలి అంటూ నవ్వుతూ మాట్లాడాడు.. ఇక ఈ మాటలు విన్న చాలామంది ‘మన డబ్బా మనమే కొట్టుకోవాలి’ అనే మాట అల్లు అర్జున్ ను ఉద్దేశించే నాగబాబు మాట్లాడాడు అంటూ కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు.

    ఇక ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ స్టేజ్ ఎక్కిన ప్రతిసారి తన గురించి తను ఏదో పొగుడుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఆయనను ఉద్దేశించే నాగబాబు ఈ మాటలు మాట్లాడాడు…ఎందుకంటే వీళ్లకు గత కొన్ని రోజుల నుంచి పడటం లేదు కాబట్టి అవకాశం దొరికిన ప్రతిసారి నాగబాబు ఏదో ఒక కామెంట్ అయితే చేస్తూ ఉంటాడు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది…