Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో మంచు విష్ణు – ప్రకాష్ రాజ్ మధ్య సాగుతున్న రసవత్తర పోరులో విష్ణుకి బాలయ్య, కృష్ణ లాంటి స్టార్లు డైరెక్ట్ గానే సపోర్ట్ చేశారు. కానీ ప్రకాష్ రాజ్ కి మెగాస్టార్ సపోర్ట్ ఉందని ఇన్నాళ్లు బలంగా వినిపించినా చిరంజీవి ఎక్కడా బయటకు వచ్చి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పలేదు. దాంతో అధ్యక్షుడిగా నిలబడ్డ ప్రకాష్ రాజ్ కి స్టార్ హీరోలు మద్దతు కరువైంది.

అయితే, నిన్న జరిగిన మీటింగ్ లో పాల్గొన్న నాగబాబు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కే మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఉందని, ఉంటుందని నాగబాబు చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు చిరంజీవి బయటికి వచ్చి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పలేదు కాబట్టే… సడెన్ గా నాగబాబు ప్రెస్ మీట్ పెట్టి మెగాస్టార్ సపోర్ట్ ప్రకాష్ రాజ్ కే అని తేల్చి చెప్పారు అనుకోవచ్చు.
అయితే ఎన్నికల్లో గెలిచేందుకు కొందరు ఓటుకి పదివేలు చొప్పున ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారని నాగబాబు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇది చేస్తోంది విష్ణునే అంటూ నాగబాబు ప్రస్తావించలేదు. కానీ నాగబాబు ఉద్దేశ్యం విష్ణు బ్యాచే ఇలా చేస్తున్నారని చెప్పడమే. పైగా డబ్బులతో ప్రలోభాలు పెడుతూ “మా” ప్రతిష్టని మసకబారుస్తున్నారని కూడా నాగబాబు ఆరోపణలు చేశాడు.
అయితే, ఈ ఆరోపణల వెనుక నాగబాబులో చిన్న కోపం దాగి ఉంది. విష్ణు, పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి.. ప్రకాష్ రాజ్ గారు మీరు పవన్ కళ్యాణ్ వైపు ఉంటారా ? ఇండస్ట్రీ వైపు ఉంటారా ? అంటూ కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ నాగబాబును బాధ పెట్టాయి. ఈ విషయాన్ని ఆయన ఇన్ డైరెక్ట్ గా వ్యక్తపరిచారు కూడా. అందుకే, విష్ణు పై కోపాన్ని ఆరోణలు చేసి తీర్చుకున్నారు అనుకోవచ్చు.
ఎందుకంటే.. ఓటర్లకు డబ్బు ఆశ చూపిస్తోంది ప్రకాష్ రాజ్ బ్యాచే అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అలాంటిది ప్రకాష్ రాజ్ పై నాగబాబు కామెంట్స్ చేయకుండా విష్ణు పై విరుచుకు పడటం.. విష్ణు, పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడటమే. ఒకవేళ పవన్ ప్రస్తావన విష్ణు తీసుకురాకుండా ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. విష్ణుకి మరింత బలం పెరిగేది.
అప్పుడు విష్ణుకి గెలుపు సులభం అయ్యేది. ఇప్పుడు గెలవడానికి చాలా రకాలుగా విష్ణు ప్రయత్నాలు చేయాల్సి వస్తోంది. మొత్తానికి పవన్ పై కామెంట్సే విష్ణు కొంప ముంచాయి. అయితే, ఇప్పుడున్న సమాచారం ప్రకారం.. విష్ణు చేతిలో 230 ఓటర్లు ఉన్నారని.. ఇక ఎన్నికల్లో మరో 60 ఓట్లు వచ్చినా గెలుపు తనదే అవుతుంది అని విష్ణు నమ్మకంగా ఉన్నాడు. మరి ఏమి జరుగుతుందో చూడాలి.