Naga Vamsi Mass Jathara Pre Release Event: సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ లో ఉండే పేర్లలో ఒకటి నాగవంశీ(Nagavamsi). ఒక నిర్మాతకు సోషల్ మీడియా లో ఇంత బజ్ ఉండడం గతంలో బండ్ల గణేష్ కి జరిగింది, ఇప్పుడు నాగవంశీ విషయం లో కూడా జరిగింది. కరోనా లాక్ డౌన్ తర్వాత అత్యధిక సక్సెస్ రేషన్ ఉన్న నిర్మాత ఇతనే. అంతే కాదు యూత్ ఆడియన్స్ రిపీట్ గా చూసుకునే కల్ట్ క్లాసిక్ చిత్రాలను కూడా అందించాడు. అయితే ఈవెంట్స్ లో కానీ, లేదా ఇంటర్వ్యూస్ లో కానీ నాగవంశీ మాట్లాడే మాటలు బాగా వైరల్ అవుతుంటాయి. కొన్ని కొన్ని సార్లు వివాదాలకు కూడా దారి తీస్తూ ఉంటుంది. ఏడాది ఆగష్టు నెలలో విడుదలైన ‘వార్ 2’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మాటలు ఎంతటి దుమారం రేపాయో ప్రత్యేకించి చెప్పనవసరం.
Also Read: ‘మాస్ జాతర’ ఫ్లాప్ అయితే నటనకు గుడ్ బై చెప్పేస్తా – రాజేంద్ర ప్రసాద్
ఆడియన్స్ ని తమ సినిమా చూడమని రిక్వెస్ట్ చేయాల్సింది పోయి, డిమాండ్ చేసాడు. సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడంతో సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఒక రేంజ్ లో నిర్మాత నాగవంశీ తో ఆడుకున్నారు. కొన్ని వెబ్ సైట్స్ అయితే నాగ వంశీ హైదరాబాద్ శాశ్వతంగా వదిలి దుబాయి వెళ్లిపోయాడని, అక్కడ కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా జరిగింది. కానీ అలాంటివేం నిజం కాదని, నాగవంశీ కూడా క్లారిటీ ఇవ్వడంతో ఆ రూమర్స్ కి చెక్ పడింది . కానీ అప్పటి నుండి మాత్రం నోటికి కంట్రోల్ పెట్టుకున్నాడు నాగవంశీ. ఇప్పుడు స్టేజి మీద మైక్ కనపడితే వణికిపోతున్నాడు. రీసెంట్ గానే ఆయన రవితేజ(Mass Maharaja Raviteja) ని హీరో గా పెట్టి ‘మాస్ జాతర'(Mass Jathara Movie) అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ నెల 31 న ప్రీమియర్ షోస్ తో ఈ సినిమా విడుదల కాబోతుంది.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి సూర్య ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ ఈవెంట్ లో నాగవంశీ మాట్లాడుతూ ‘రవితేజ గారి సినిమాల నుండి ఆడియన్స్ ఏదైతే ఆశించి థియేటర్స్ కి వస్తారో, అవన్నీ ఈ సినిమాలో కచ్చితంగా ఉంటాయి. అవి సూపర్, బంపర్ అని నేను చెప్పను. మళ్లీ వాళ్లకు నచ్చకపోతే నన్ను ఏసుకుంటారు. మీరు థియేటర్స్ లో చూసి, మీ నోటితోనే బాగుందని చెప్తారు అనే నమ్మకం గట్టిగా ఉంది నాకు’ అని అంటాడు. నాగవంశీ తడబాటు ని చూస్తుంటే సినిమా బాగా రాలేదా?, ప్రతీ సినిమాకు ఎంతో నమ్మకంతో మాట్లాడే నాగవంశీ ఈ చిత్రానికి మాత్రం ఎందుకు మౌనం వహిస్తున్నాడు అనే అనుమానం ఆడియన్స్ లో బలంగా ఉంది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.