https://oktelugu.com/

Naga Shourya: నాగశౌర్య “వరుడు కావలెను” మూవీ ట్రైలర్ రిలీజ్… 

Naga Shourya: తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలను పొందుతున్న నటుల్లో యంగ్ హీరో నాగ శౌర్య కూడా ఒకరు. కెరీర్ పరంగా శౌర్య ఫుల్ ఫామ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ హీరో ప్రస్తుతం రీతూ వర్మతో కలిసి నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీ … షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమాకి లక్ష్మి సౌజన్య […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 22, 2021 / 10:14 AM IST
    Follow us on

    Naga Shourya: తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలను పొందుతున్న నటుల్లో యంగ్ హీరో నాగ శౌర్య కూడా ఒకరు. కెరీర్ పరంగా శౌర్య ఫుల్ ఫామ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ హీరో ప్రస్తుతం రీతూ వర్మతో కలిసి నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీ … షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమాకి లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తుండగా… ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేస్తున్నామని చిత్రా బృందం గతంలో తేదిని ప్రకటించింది. అయితే పలు కారణాల ఈ సినిమా వాయిదా పడింది. ఈ సినిమాను దసరాకు విడుదల చేయట్లేదని, ఈ చిత్రాన్ని అక్టోబర్ 29 న విడుదల చేయనున్నామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.

    ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రానా స్పెషల్ గెస్ట్ గా విచ్చేసి… ట్రైలర్ ను విడుదల చేశారు.  ఫన్ అండ్ ఎమోషన్‌ సీన్స్‌తో ట్రైలర్ చాలా ఆహ్లదకరంగా అందర్నీ ఆకట్టుకుంటోంది. పొగ‌రు బోతుల‌కు క‌నుక ప్రీమియ‌ర్ లీగ్ ఉంటే ప్ర‌తీ సీజ‌న్‌లో ఆవిడే విన్న‌ర్ తెలుసా… అంటూ వెన్నెల కిశోర్ డైలాగ్ హైలైట్ అని చెప్పాలి. ఎన్ని రోజుల అయ్యిందిరా.. చీరలు, చూడీదార్‌లు చూసి అనే డైలాగ్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. భూమి, ఆకాష్ పాత్రల్లో రీతూ వర్మ, నాగ శౌర్యలు అదరగొట్టారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, U/A సర్టిఫికెట్ ను తెచ్చుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ… సంబంధిత పోస్టర్‌ను కూడా మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.