Naga Chaitanya : సమంతతో విడిపోయాక నాగచైతన్య పెద్దగా బయట కనిపించడం లేదు. రిజర్వ్ గా ఉంటున్నాడు. ఇటీవల మహేష్ తండ్రి కృష్ణ అంత్యక్రియలకు వచ్చి నివాళులర్పించారు. ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు.

ఇక సమంత మాత్రం ‘మయోసైటిస్’ వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటోంది. ఆమెను నాగచైతన్య పరామర్శించినట్టు టాక్ నడిచినా అది ఎక్కడా బయటపడలేదు. సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య మరో హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ వార్తల జోరు తగ్గకముందే తాజాగా నాగచైతన్య మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నాగచైతన్యను గట్టిగా హత్తుకున్న ఆ అమ్మాయి బావ అంటూ పరిచయం చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరని తెలిస్తే అందరూ షాక్ అయ్యే నిజం తెలిసింది.
నాగచైతన్యతో కలిసి ఒక ఫుడ్ ఐటెం తయారు చేసిన ఈ యూట్యూబ్ బ్లాగర్ మరెవరో కాదు.. స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత. ఈ వీడియోలో చైతు, ఆశ్రిత కలిసి వంట చేయడం.. అటుపై ఇద్దరూ కలిసి తినడంతో కొత్త చర్చ నడుస్తోంది.

వెంకటేశ్ పెద్ద కూతురు యూరప్ లోని బార్సిలోనాలో ఉంటోంది. పెళ్లైంది. భర్తతో కలిసి అక్కడే ఉంటూ ప్రపంచవ్యాప్తంగా వెరైటీ ఫుడ్స్ ను తయారు చేస్తూ యూట్యూబ్ లో అప్ లోడ్ చేసి ‘ఇన్ఫినిటీ ఫ్లాటర్’ అనే యూట్యూబ్ చానెల్ ద్వారా ఫేమస్ అయ్యింది. ఆమె ఎన్నో కొత్త వంటలను తయారు చేస్తుంది. ఈ వీడియోల ద్వారా ఫేమస్ అయిన వెంకటేశ్ కూతురు అశ్రిత ఆదాయం ఒక సినిమాలో నటించే హీరోయిన్ కంటే ఎక్కువగానే సంపాదిస్తోందని టాక్.
అశ్రిత తాజాగా తన కిచెన్ ప్రోగ్రామ్ లో నాగచైతన్యతో కలిసి ఒక వెరైటీ వంటకాన్ని ప్రిపేర్ చేసింది. మొదటగా ‘బావ’ అంటూ నాగచైతన్యను గట్టిగా హత్తుకొని ఆనందం వ్యక్తం చేసింది. అనంతరం బావ నాగచైతన్యతో కలిసి ఒక వెరైటీ డిష్ ప్రిపేర్ చేసింది అశ్రిత. ఇద్దరూ కలిసి చేసి అనంతరం తిన్నారు.

వీరిద్దరూ కలిసి ఉన్న వీడియో చూశాక వెంకీ కూతురు యూరప్ నుంచి హైదరాబాద్ ఎందుకొచ్చింది.? ఆమె సంసార జీవితం సాఫీగానే సాగుతుందా? చైతన్యతో కలిసి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిందా? లేక సరదాగా ఈ వంట ప్రోగ్రాంను చైతన్యతో చేసిందా? ఇలా బోలెడన్నీ సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలే అయినా… మున్ముందు అసలు విషయం ఏంటన్నది తెలియాల్సి ఉంది.
