https://oktelugu.com/

Naga Chaitanya- Kalyan Ram: కళ్యాణ్ రామ్ కి స్టార్ డైరెక్టర్ ను సెట్ చేసిన నాగచైతన్య

Naga Chaitanya- Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ కి ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది. కొత్తవాళ్లను ముఖ్యంగా కొత్త దర్శకుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడనే సాఫ్ట్ కార్నర్ ఉంది. కాకపోతే.. హిట్లు మాత్రం రేర్. అయినా నందమూరి కళ్యాణ్ రామ్ మాత్రం.. కెరీర్ లో వరుస ప్రాజెక్ట్లను ఓకే చేసుకుంటూ దూసుకెళ్తున్నారు. తాజాగా కళ్యాణ్ రామ్ మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని టాక్ నడుస్తోంది. నిజానికి కళ్యాణ్ రామ్ చేతిలో […]

Written By:
  • Shiva
  • , Updated On : June 30, 2022 / 05:06 PM IST
    Follow us on

    Naga Chaitanya- Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ కి ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది. కొత్తవాళ్లను ముఖ్యంగా కొత్త దర్శకుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడనే సాఫ్ట్ కార్నర్ ఉంది. కాకపోతే.. హిట్లు మాత్రం రేర్. అయినా నందమూరి కళ్యాణ్ రామ్ మాత్రం.. కెరీర్ లో వరుస ప్రాజెక్ట్లను ఓకే చేసుకుంటూ దూసుకెళ్తున్నారు. తాజాగా కళ్యాణ్ రామ్ మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని టాక్ నడుస్తోంది.

    Naga Chaitanya

    నిజానికి కళ్యాణ్ రామ్ చేతిలో ప్రస్తుతానికి మూడు సినిమాలు ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా కళ్యాణ్ రామ్ మరో కొత్త సినిమా కోసం చర్చలు జరిపారు. గతంలో కళ్యాణ్ రామ్ కొన్ని కథలకు మాత్రమే పరిమితం అయ్యేవారు. కానీ.. ఇప్పుడు మాత్రం తాను ప్రేమకథలకైనా సరే, యాక్షన్‌ కథలకైనా సరే రెడీ అంటున్నాడు.

    Also Read: Anasuya Bharadwaj: జబర్ధస్త్ నుంచి వైదొలిగిన అనసూయ నెక్ట్స్ టార్గెట్ అవేనట.?

    అందుకే, కళ్యాణ్ రామ్ కోసం ఇతర బాషల దర్శకులు కూడా కథలు పట్టుకొస్తున్నారు. తాజాగా స్టార్ డైరెక్టర్ గౌతమ్‌ మీనన్‌ ఓ కథ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ – గౌతమ్‌ మీనన్‌ మధ్య కొంతకాలంగా కథా చర్చలు జరుగుతున్నాయి. నిజానికి గౌతమ్‌ మీనన్‌, హీరో నాగచైతన్యతో సినిమా ప్లాన్ చేశాడు. అయితే.. గౌతమ్‌ మీనన్‌ చెప్పిన కథ, కళ్యాణ్ రామ్ కి అయితే బాగుంటుందని చైతు.. కళ్యాణ్ రామ్ కి గౌతమ్‌ మీనన్‌ ను కనెక్ట్ చేశాడు.

    Kalyan Ram

    అప్పటి నుంచి గౌతమ్‌ మీనన్‌ – కళ్యాణ్ రామ్ మధ్య కథా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఫైనల్ గా కళ్యాణ్ రామ్ కి కథ బాగా నచ్చింది. అందుకే.. ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ ఓకే చెప్పాడు. ఏది ఏమైనా మేకింగ్‌ లో ప్రత్యేకమైన శైలి ఉన్న దర్శకుడు గౌతమ్‌ మీనన్‌. అందుకే.. హీరో కళ్యాణ్ రామ్‌ తో జట్టు కట్టనుండడం బాగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

    ఇక కళ్యాణ్ రామ్.. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో కూడా ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి మధ్య కథా చర్చలు జరుగుతున్నాయట. ఒకవేళ ఈ రెండు ప్రాజెక్ట్లు ఓకే అయితే కళ్యాణ్ రామ్ సినిమాల లిస్ట్ 5 కు చేరుకుంటుంది. మరి వీటిలో ఏది ముందు రిలీజ్ కి వెళ్తుందో చూడాలి.

    Also Read:KTR- Modi: మోడీదీ మోసమైతే తమరిదేంటిది కేటీఆర్ సార్?

    Tags