https://oktelugu.com/

‘Tandel Movie Review : తండేల్ ‘ఫుల్ మూవీ రివ్యూ…

నాగచైతన్య లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. తన తోటి హీరోలు టాప్ హీరోలుగా ఎదుగుతున్న సందర్భంలో ఆయన అడపాదడపా సక్సెస్ లతో ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఈరోజు రిలీజ్ అయిన 'తండేల్ ' సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By: , Updated On : February 7, 2025 / 03:06 PM IST
Thandel Collections

Thandel Collections

Follow us on

‘Tandel Movie Review :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగచైతన్యకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…మరి ఏది ఏమైనా కూడా నాగచైతన్య లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. తన తోటి హీరోలు టాప్ హీరోలుగా ఎదుగుతున్న సందర్భంలో ఆయన అడపాదడపా సక్సెస్ లతో ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఈరోజు రిలీజ్ అయిన ‘తండేల్ ‘ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ఇక ముందుగా కథ విషయానికి వస్తే శ్రీకాకుళం దగ్గర ఒక ఊరిలో రాజు(నాగ చైతన్య), సత్య(సాయి పల్లవి) ఇద్దరు ప్రేమించుకుంటారు…రాజు ఒక సంవత్సరంలో 9 నెలలు సముద్రంలో వేటకి వెళ్లి కేవలం మూడు నెలలు మాత్రమే ఊరిలో ఉంటాడు. మరి ఇలాంటి సందర్భంలో ఊరిలో ఉన్న ఒక ప్రాబ్లం ను సాల్వ్ చేయడం తో రాజు తండేల్ రాజు గా మారతాడు… తండేల్ అంటే వాళ్ల టీమ్ కి లీడర్…

ఇక అనుకోని క్రమం లో రాజు టీమ్ చేపల వేటకు వెళ్ళినప్పుడు సముద్రంలో తుఫాన్ వస్తుంది. దాని నుంచి తప్పించుకుంటూ వాళ్ళు పాకిస్థాన్ సముద్ర జలాల్లోకి వెళ్లి పోతారు…దాంతో పాకిస్థాన్ పోలీసులు వాళ్ళను అరెస్టు చేస్తారు…ఇక వాళ్ళు జైలు నుంచి ఎలా బయటపడ్డారు…సత్యకి రాజు కి మధ్య దూరం ఎందుకు పెరిగింది….రాజు ను కాదని సత్య వేరేవాళ్ళతో పెళ్లి కి ఎందుకు సిద్ధం అయింది అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు చందు మొండేటి ఒక రియల్ స్టోరీ కథను సినిమాగా తీయాలి అనుకోవడం నిజంగా అతనికి ఘట్స్ కి మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక 22 మందితో కూడిన టీం పాకిస్తాన్ వాళ్ళకి దొరికిపోయారు అనే ఒక్క పాయింట్ ని మినహాయిస్తే సినిమాలో పెద్దగా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అయితే ఏది ఉండదు. కానీ దర్శకుడు దానికి ఒక లవ్ స్టోరీ ని ఆడ్ చేసి రాసిన రచన బాగా కుదిరింది. దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో కూడా ఆయన చాలా వరకు సక్సెస్ అయితే సాధించాడు…

దానికి తోడుగా తండేల్ అనే పదానికి సరైన జస్టిఫికేషన్ కూడా ఇచ్చాడు. ముఖ్యంగా ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవిల మధ్య వచ్చిన లవ్ స్టోరీ చాలా బాగా కుదిరింది. ఫస్టాఫ్ కొంతవరకు అక్కడక్కడ సన్నివేశాలు బోరింగ్ గా సాగినప్పటికి సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి మాత్రం సినిమాని కొంచెం ఫాస్ట్ గా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇక ముఖ్యంగా పాకిస్తాన్ జైల్లో కొన్ని సీన్స్ హై ఫీల్ ఇస్తాయి…

అలాగే క్లైమాక్స్ కూడా చాలా అద్భుతంగా రాసుకున్నారు. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని రకాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. నిజానికి ఈ సినిమాలో అంతా బానే ఉన్నప్పటికి ఫస్ట్ హాఫ్ లో వచ్చిన కొన్ని సన్నివేశాలను మరికాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ ఎంతసేపు ఒక సాగదీత లాగా అనిపించింది. నిజానికి ఈ సినిమాకి అంత డ్యూరేషన్ కూడా అవసరం లేదు. ఇక సెకండ్ హాఫ్ లో జైల్లో వచ్చిన కొన్ని సీన్లు ఆర్టిఫీషియల్ గా అనిపించాయి… కొన్ని సీన్లలో లాజిక్స్ కూడా అంత బాగా సెట్ అవ్వలేదు.

అయినప్పటికి సినిమా మొత్తం ఒక ఎమోషనల్ డ్రామా తో ముందుకు సాగింది. కాబట్టి లాజిక్స్ ని పెద్దగా పట్టించుకునే అవకాశమైతే లేదు… ఇక శ్రీకాకుళం స్లాంగ్ కొంతవరకు సెట్ అయినప్పటికి నాగచైతన్య, సాయి పల్లవి మాట్లాడిన స్లాంగ్ అయితే అంత పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు. దానిమీద మరికాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది.ఇక చేపలు పట్టే వాళ్ల భాదలు ఎలా ఉంటాయి అనేది ఇంకాస్త పర్ఫెక్ట్ గా చూపిస్తే బాగుండేది…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే నాగచైతన్య గత చిత్రాల కంటే ఈ సినిమాలో కొంచెం డిఫరెంట్ యాక్టింగ్ ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు.రగ్గుడ్ లుక్ లో కనిపించిన ఆయన ఈ సినిమాలో కొంత వరకు కొత్తగా నటించే ప్రయత్నం చేశాడు. మరి ఇలాంటి పాత్ర ఆయన ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు కాబట్టి తనకు ఇది చాలా ఫ్రెష్ పాత్ర కావడంతో చాలా బాగా నటించడానికి స్కోప్ అయితే ఉంది.వచ్చిన అవకాశాన్ని చాలా బాగా వాడుకున్నాడు… ఇక సాయి పల్లవి యాక్టింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో నాగచైతన్య ఎంతలా అయితే నటించి మెప్పించాడో అంతకుమించి సాయి పల్లవి నటించిందనే చెప్పాలి.

ఇక సినిమాలో వాళ్ళను జైల్లో నుంచి విడిపించడానికి ఆమె పడే స్ట్రగుల్స్ చూస్తే ప్రేక్షకులకు కూడా కన్నీళ్లు వస్తుంటాయి. అంత బాగా నటించి మెప్పించడంలో ఆమె సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇక డాన్స్ విషయంలో అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి… ఇక మిగిలిన ఆర్టిస్టులందరు కూడా చాలా చక్కటి పర్ఫామెన్స్ అయితే ఇచ్చారు…

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగా ప్లస్ అయింది. ముఖ్యంగా హైలెస్సా, బుజ్జి తల్లి అనే రెండు సాంగ్స్ మాత్రం చాలా బాగా వర్కవుట్ అయ్యాయి. ఇక వాటితో పాటుగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా వరకు వర్కవుట్ అయింది…ఇక సినిమాటోగ్రఫీ కూడా ఓకే అనిపించేలా ఉంది. కానీ విజువల్స్ మీద ఇంకాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది…

ప్లస్ పాయింట్స్

ఎమోషనల్ సీన్స్
నాగ చైతన్య, సాయి పల్లవి యాక్టింగ్
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్
విజువల్స్ లో రిచ్ నెస్ లేకపోవడం

రేటింగ్

ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.75/5

Thandel Trailer (Telugu) | Naga Chaitanya, Sai Pallavi | Chandoo Mondeti | Allu Aravind | DSP