Naga Chaitanya : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ నుంచి వస్తున్న ప్రతి హీరో కూడా స్టార్ హీరోగా ఎదగాలనే తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నారు. నిజానికి అక్కినేని నాగేశ్వరరావు తర్వాత నాగార్జున ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా మారడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకున్నాడు. ఇక తెలుగులో ఉన్న నలుగురు టాప్ హీరోల్లో తను కూడా ఒకడిగా ఎదిగాడు. ఇక ఆయన తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన నాగచైతన్య, అఖిల్ లాంటి వాళ్లు మాత్రం స్టార్ స్టేటస్ ని అందుకోలేకపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు చేస్తున్న సినిమాల ద్వారా ప్రేక్షకులకు ఎలాంటి ఎంటర్ టైన్ మెంట్ ను అందించలేకపోవడంతో వాళ్ళు తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇక ఇదిలా ఉంటే నాగచైతన్య ఇప్పుడు కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. కార్తీక్ దండు ఇంతకుముందు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ను హీరోగా పెట్టి చేసిన వీరూపాక్ష (వీరుపాక్ష) మూవీ మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాకి స్క్రీన్ ప్లే ని అందించిన సుకుమార్ మరోసారి నాగచైతన్య సినిమాకి కూడా స్క్రీన్ ప్లే అందిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : నాగచైతన్య పై సమంత కామెంట్స్ ఆగేలా లేవుగా?
మరి ఏది ఏమైనా కూడా ఈ మధ్యకాలంలో సుకుమార్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆయన సినిమాలు చేసినప్పటికి అతని శిష్యులు సినిమాలు చేసినా కూడా ఆయన ఏదో ఒకరకంగా సినిమాలన్నింటికి సహాయ సహకారాలను అందిస్తూ భారీ సక్సెస్ లను సాధించడంలో కీలకపాత్ర వహిస్తూ వస్తున్నాడు.
మరి ఇలాంటి సందర్భంలో ఇక మీదట రాబోయే సినిమాలతో కూడా భారీ విజయాలను అందుకొని వాళ్ళకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను సంపాదించుకునే ఉద్దేశం లో ఉన్న దర్శకులు తమ గురువు అయిన సుకుమార్ యొక్క సలహాలను పాటిస్తున్నారు. నిజానికి కార్తీక్ దండుకి గురువు సుకుమార్ కాకపోయినప్పటికి ఆయన చెప్పిన వీరూపాక్ష కథ బాగా నచ్చడంతో సుకుమార్(Sukumar) ఆ సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా మారాడు.
ఇక దాంతో పాటుగా ఆ సినిమాకి స్క్రీన్ ప్లే ను కూడా అందించి దానిని సూపర్ సక్సెస్ చేయడంలో కీలకపాత్ర వహించాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా దర్శకుడు అయిన కార్తీక్ దండు కూడా వరుస సినిమాలతో భారీ సక్సెస్ లను సాధించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక తను అనుకున్నట్టుగానే రాబోయే సినిమాలతో కూడా భారీ విజయాలను సాధిస్తూ తన కంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్దు రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : నాగ చైతన్య టాటూ ని తొలగించడానికి సమంత అంత పని చేసిందా..?