Bigg Boss Telugu 8 : కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ 8 ఎట్టకేలకు ఈ నెల 1 వ తేదీన గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. ముందు సీజన్స్ లో లాగ కాకుండా, ఈ సీజన్ లో కేవలం 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్ లోకి అడుగుపెట్టారు. మిగిలిన కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా రాబోయే వారాల్లో రానున్నారని తెలుస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే మొదటి రోజు నుండి బిగ్ బాస్ హౌస్ లో గొడవలు ప్రారంభమైన సంగతి ఈ షో ని చూస్తున్న ప్రతీ ఒకరికి తెలుసు. టాస్కులు తక్కువ, గొడవలు ఎక్కువ అన్నట్టుగా ఈ సీజన్ ఆరంభం తయారైంది. నామినేషన్స్ పర్వం కోసం రెండు ఎపిసోడ్స్ ని కేటాయించారు. నిన్న మొదలైన ఈ నామినేషన్స్ పర్వం నేడు కూడా కొనసాగనుంది. కంటెస్టెంట్స్ మధ్య పెద్దగా కనెక్షన్ ఏర్పాటు కాకపోయినా కూడా ఒకరిని ఒకరు తిట్టుకోవడాన్ని మనం చూడొచ్చు.
కొంతమంది కంటెస్టెంట్స్ అయితే సానుభూతి గేమ్స్ కూడా ఆరంభించేసారు. దీని మీద కూడా పెద్ద చర్చ మొదలైంది. ఇలా సీజన్ ఆరంభంలోనే గొడవలు ఉండడం తో ఆడియన్స్ నుండి నెగటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఒకరి మీద ఒకరు ఎందుకు అరుచుకుంటున్నారో అర్థం కావడం లేదు, సీజన్ 7 మొదటి ఎపిసోడ్ నుండే అన్ని సహజం గా ఉండేది. టాస్కులు కూడా ఆసక్తికరంగా ఉండేవి, కానీ సీజన్ 8 లో ఇప్పటి వరకు అలాంటివి జరగలేదు. చూస్తుంటే సీజన్ 6 ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో, సీజన్ 8 అంతకు మించి ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్న మాట. అయితే ఈ సీజన్ లోకి ఈసారి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా పాత కంటెస్టెంట్స్ కూడా రాబోతున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత గేమ్ ఏమైనా మారుతుందేమో చూడాలి. ఇదంతా పక్కన పెడితే సెప్టెంబర్ 7 వ తారీఖున వినాయక చవితి సందర్భంగా బిగ్ బాస్ టీం ఒక స్పెషల్ ఎపిసోడ్ ని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ కి అక్కినేని నాగ చైతన్య తన కాబోయే భార్య శోభిత తో కలిసి జంటగా హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది.
లాంచ్ ఎపిసోడ్ లో హీరో నాని, రానా దగ్గుబాటి, అనిల్ రావిపూడి వంటి వారు హౌస్ లోకి అడుగుపెట్టి కంటెస్టెంట్స్ తో ఎలా అయితే టాస్కులు ఆడించారో, నాగ చైతన్య – శోభిత కూడా కంటెస్టెంట్స్ తో అలాంటి టాస్కులు ఆడించబోతున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిశ్చితార్థం తర్వాత మొట్టమొదటిసారి నాగ చైతన్య – శోభిత కలిసి ఒక షో కి రావడం జరుగుతుండడంతో ఆడియన్స్ లో ఈ ఎపిసోడ్ పై అమితాసక్తి నెలకొంది. చూడాలి మరి ఈ ఎపిసోడ్ తర్వాత నుండి అయినా గేమ్ మారుతుందా లేదా అనేది.