https://oktelugu.com/

Naga Chaitanya Sobhita Marriage: నాగ చైతన్య-శోభిత పెళ్లి హైలైట్స్.. ఏకంగా 8 గంటల పాటు, మైండ్ బ్లోయింగ్ డిటైల్స్

నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల పెళ్లి వేడుకకు సమయం ఆసన్నం అవుతుంది. మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అవేమిటో గమనిస్తే.. ఏకంగా 8 గంటల పాటు వీరి వివాహం జరగనుందట. అలాగే మరి కొన్ని ప్రత్యేకతలు ఈ వివాహంలో చోటు చేసుకోనున్నాయి.. అవేమిటో చూద్దాం.

Written By:
  • S Reddy
  • , Updated On : November 28, 2024 / 08:03 AM IST

    Naga Chaitanya Sobhita Marriage(1)

    Follow us on

    Naga Chaitanya Sobhita Marriage: రెండేళ్లకు పైగా ప్రేమించిన ప్రేయసి శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్య ఏడడుగులు వేయనున్నారు. ఆగస్టు లో వీరికి నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్ 4న పెళ్ళికి ముహూర్తం పెట్టారు. నాగ చైతన్య పెళ్లి నిరాడంబరంగా, అతికొద్ది సన్నిహితుల మధ్య నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే కేవలం 300ల మందికి మాత్రమే ఆహ్వానం ఉంది. పెళ్లి కార్డుతో పాటు బహుమతులు, స్వీట్స్ తో కూడిన ఒక బాస్కెట్ ని అతిథులకు, ప్రముఖులకు ఇచ్చారు.

    కాగా నాగ చైతన్య-శోభితల వివాహం నిరాడంబరంగా జరుగుతున్నప్పటికీ అనేక ప్రత్యేకతలు ఉన్నాయట. శోభిత ధూళిపాళ్ల బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. వారి వివాహ సాంప్రదాయాన్ని పాటిస్తూ.. పాత కాలపు పద్ధతిలో వివాహం నిర్వహించనున్నారట. ఈ స్టార్ కపుల్ పెళ్లికి ఏకంగా 8 గంటల సమయం పడుతుందట. మంత్రాలు, పూజలు, సాంప్రదాయాలు పూర్తి చేయడానికి సుదీర్ఘ సమయం తీసుకుంటుందట. ఇక పెళ్ళిలో వధూవరులు ధరించే బట్టలు కూడా చాలా స్పెషల్ అంటున్నారు.

    పెళ్లి కూతురు శోభిత… పెళ్లి రోజు కాంజీవరం బంగారు జెరీ కలిగిన చీరను ధరించనున్నారట. నిజమైన బంగారంతో తయారు చేసిన చేసిన జెరీ చీరలను తల్లితో కలిసి శోభిత షాపింగ్ చేశారట. అలాగే పొందూరులో నేసిన ఖాదీ చీర ఆమె ధరిస్తారట. ఆమె చీరకు మ్యాచ్ అయ్యే సాంప్రదాయ పెళ్లి దుస్తులు నాగ చైత్యన్య కొరకు సిద్ధం చేశారట. సాధారణంగా సెలెబ్రిటీలు పెళ్లి అనగానే ముంబైకి చెందిన ప్రముఖ డిజైనర్స్ ని ఆశ్రయిస్తారు. లక్షలు పోసీ ప్రత్యేకంగా రూపొందించుకుంటారు. అందుకు భిన్నంగా నాగ చైతన్య-శోభిత పక్కా తెలుగు సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకుంటున్నారు.

    మరోవైపు ఈ పెళ్లి వేడుక స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఏకంగా రూ. 50 కోట్లు చెల్లించి నాగ చైతన్య-శోభిత పెళ్లి వీడియో మీద ఓటీటీ హక్కులు సదరు సంస్థ కొనుగోలు చేసిందట. కాగా స్టార్ లేడీ నయనతార పెళ్లిపై నెట్ఫ్లిక్స్ సంస్థ డాక్యుమెంటరీ చేసిన సంగతి తెలిసిందే. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ పేరుతో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నయనతార మ్యారేజ్ డిజిటల్ రైట్స్ కి నెట్ఫ్లిక్స్ రూ. 25 కోట్లు చెల్లించిందనే వాదన ఉంది. కాగా