https://oktelugu.com/

Naga Chaitanya-Shobhita wedding Card : వైరల్ అవుతున్న నాగ చైతన్య, శోభిత పెళ్లి శుభలేఖ..దీని ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

నాగ చైతన్య, శోభిత పెళ్లి అలా కాదు. ఒకప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ పెళ్లిళ్లు ఎలా జరిగాయో, ఆ రేంజ్ లోనే జరగబోతుంది ఈ పెళ్లి. ఇది ఇలా ఉండగా వీళ్లిద్దరి పెళ్లికి సంబంధించిన శుభ లేఖ ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 17, 2024 / 04:31 PM IST

    Naga Chaitanya-Shobhita wedding Card

    Follow us on

    Naga Chaitanya-Shobhita wedding Card : అక్కినేని నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల జంట వివాహానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ సోషల్ మీడియా లో వచ్చినా, అది తెగ వైరల్ గా మారిపోతుంది. ఇటీవలే శోభిత తన పుట్టింట్లో పెళ్లి పనులు చేపడుతూ సోషల్ మీడియా లో వాటికి సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేయగా, అవి బాగా వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి పెళ్లి ఎప్పుడు జరగబోతుంది అనేది అధికారికంగా ప్రకటించలేదు కానీ, డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో అతిరథ మహారథుల సమక్ష్యంలో గ్రాండ్ గా జరిపించబోతున్నారు. చాలా కాలం తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి చేసుకుంటున్న సెలబ్రిటీ కపుల్ గా నాగ చైతన్య శోభిత నిలిచారు. ఈమధ్య కాలం లో డెస్టినేషన్ వెడ్డింగ్ పేరిట ఇతర రాష్ట్రాల్లో, అదే విధంగా విదేశాల్లో సెలెబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. మీడియా కి కూడా అనుమతి ఉండేది కాదు, దీంతో అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురయ్యేవారు.

    కానీ నాగ చైతన్య, శోభిత పెళ్లి అలా కాదు. ఒకప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ పెళ్లిళ్లు ఎలా జరిగాయో, ఆ రేంజ్ లోనే జరగబోతుంది ఈ పెళ్లి. ఇది ఇలా ఉండగా వీళ్లిద్దరి పెళ్లికి సంబంధించిన శుభ లేఖ ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఒక్కో శుభలేఖ విలువ 10 వేల రూపాయిలు ఉంటుందట. దీనిని బట్టి ప్రింట్ చేయించిన అన్ని శుభలేఖల విలువ ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. అక్కినేని కుటుంబ వారసుడి పెళ్లి అంటే ఆ మాత్రం లేకపోతే ఎలా. ఇప్పటికే ఈ పెళ్ళికి సంబంధించిన అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక భారీ సెట్ ని ఏర్పాటు చేస్తున్నారట. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి ఈ సెట్ ని ఏర్పాటు చేసే బాధ్యతలు తీసుకున్నాడు. ఈ సెట్ విలువ సుమారుగా 10 కోట్ల రూపాయిలు ఉంటుందని టాక్.

    అలా తెలుగు ప్రేక్షకులు జీవితాంతం గుర్తించుకునే పెళ్లి వేడుకలలో ఒకటిగా నాగ చైతన్య, శోభిత పెళ్లి వేడుకని నిలిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం నాగ చైతన్య ‘తండేల్’ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. అల్లు అరవింద్ నిర్మాతగా, గీత ఆర్ట్స్ బ్యానర్ పై సుమారుగా 70 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కార్తికేయ సిరీస్ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.