Miss Universe 2024 : ఏటా ప్రపంచ అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల భామలు పాల్గొంటారు. అందంతోపాటు శరీర ఆకృతి, మానసిక స్థిరత్వం. అంతర్జాతీయ పరిజ్ఞానం ఆధారంగా ప్రపంచ, విశ్వ సుందరు ఎవరనేది ఎంపిక చేస్తున్నారు. తాజాగా 73వ విశ్వ సుందరి పోటీలు నిర్వహించారు. ఈసారి కిరీటాన్ని తొలిసారిగా డెన్మార్క్ గెలుచుకుంది.
తొలిసారి డెన్‌మార్క్‌కు..
ఇప్పటి వరకు 72 సార్లు విశ్వసుందరి పోటీలు జరిగాయి. కానీ, డెన్మార్క్ యువతి అవార్డు గెలుచుకోవడం ఇదే తొలిసారి. 73వ మిస్ యూనివర్స్ కిరీటాన్ని డెన్మార్క్ యువతి విక్టోరియా కెజార్ హెల్విగ్ గెలుచుకుంది. మెక్సికో సిటీలో జరిగిన మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో 120 మంది యువతులు ఫైనల్‌కు చేరుకున్నారు. 119 మందిని వెనక్కు నెట్టిన 21 ఏళ్ల విక్టోరియా కెజార్ హెల్విగ్ విశ్వసుందరిగా నిలిచింది. ఈ పోటీల్లో రన్నరప్‌గా నైజీరియా భామ చిడిమ్మ అడెట్షినా, రెండో రన్నరప్‌గా మెక్సికో యువతి ఫెర్నాండా నిలిచారు.
125 మంది పోటీ..
మెక్సికోలో నిర్వహించిన ఈ మిస్ యూనివర్స్ పోటీల్లో 125 దేశాల అందెగత్తెలు పోటీ పడ్డారు. 124 మందిని వెనక్కు నెట్టిన డెన్మార్క్ యువతి విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో టాప్ 5 లిస్టులో థాయ్‌లాండ్‌కు చెందిన ఓపాల్ సుచతా చువాంగ్, వెనిజులాకు చెందిన ఇలియానా మార్క్‌క్వజ్ ఉన్నారు.
కిరీటం ప్రదానం చేసిన 2023 విజేత..
మిస్ యూనివర్స్ 2024 విజేత విక్టోరియా కెజార్ హెల్విగ్‌కు 2023 మిస్ యూనివర్స్ విన్నర్ షెన్సిస్ పలాసియోస్ కిరీటాన్ని అందించి అభినందించారు. ప్రపంచ మహిళలకు స్ఫూర్తి నింపేలా విక్టోరియా ప్రయాణం సాగాలని ఆకాంక్షించారు. ఈమేరకు మిస్ యూనివర్స్ టీమ్ శుభాకాంక్షలు తెలిపింది.
టాప్ టెన్‌లో కూడా లేని భారత్..
ఇక ఈసారి విశ్వసుందరి పోటీల్లో భారత్ తరఫున రియా సింగా పాల్గొన్నారు. కానీ, ఆమె టాప్ 5 లో కాదు.. టాప్ టెన్‌లో కూడా నిలవలేదు. దీంతో భారతీయులు నిరాశ చెందారు.