https://oktelugu.com/

Heroine Jyotika :  కంగువా’ ని ఆ హీరో అభిమానులు ప్లాన్ చేసి తోక్కేస్తున్నారు..ఇది అన్యాయం అంటూ జ్యోతిక ఎమోషనల్ కామెంట్స్!

సోషల్ మీడియా లో వచ్చే ట్రోల్స్ కి హర్ట్ అయిన సూర్య సతీమణి జ్యోతిక, నేడు తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అయింది. ఆమె మాట్లాడుతూ ' ఈ లేఖని నేను సూర్య భార్యగా కాదు, ఒక సాధారణ సినీ ప్రేమికురాలిగా మాత్రమే రాస్తున్నాను. కంగువా చిత్రం మొదటి 30 నిమిషాలు బాగాలేదు, అది నేను కూడా ఒప్పుకుంటున్నాను.

Written By:
  • Vicky
  • , Updated On : November 17, 2024 / 04:45 PM IST

    Heroine Jyotika

    Follow us on

    Heroine Jyotika :  తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘కంగువా’ ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి రోజు నుండే ఘోరమైన డిజాస్టర్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికి తెలిసిందే. సినిమాలో అసలు అరుపులు తప్ప స్టోరీ లేదని, ఇలాంటి చెత్త సినిమా కోసం సూర్య మూడేళ్ళ విలువైన సమయాన్ని వృధా చేసి అభిమానులను నిరాశపరిచాడు అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొదటి రోజే వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొడుతుందని అనుకున్న ఈ సినిమా, ఫుల్ రన్ లో కూడా 100 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టే అవకాశం లేకుండా పోయిందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో ఒక హీరో సినిమా ఫ్లాప్ అయ్యినప్పుడు, ఇతర హీరోల అభిమానులు ట్రోల్స్ వేయడం సర్వసాధారణం. ముఖ్యంగా సూర్య లాంటి సూపర్ స్టార్స్ కి ఇలాంటివి ఎదురుకోక తప్పదు.

    అయితే సోషల్ మీడియా లో వచ్చే ట్రోల్స్ కి హర్ట్ అయిన సూర్య సతీమణి జ్యోతిక, నేడు తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అయింది. ఆమె మాట్లాడుతూ ‘ ఈ లేఖని నేను సూర్య భార్యగా కాదు, ఒక సాధారణ సినీ ప్రేమికురాలిగా మాత్రమే రాస్తున్నాను. కంగువా చిత్రం మొదటి 30 నిమిషాలు బాగాలేదు, అది నేను కూడా ఒప్పుకుంటున్నాను. సౌండ్ కూడా ఆ మొదటి 30 నిమిషాలు మాత్రమే లౌడ్ గా అనిపించింది. ఆ తర్వాత సినిమా మొత్తం బాగుంటుంది. పాజిటివ్ అంశాలు బోలెడన్ని ఉన్నాయి. ఇలాంటి సినిమాలు చేయడం సాహసమనే చెప్పాలి, అందుకు నా భర్త సూర్య ని చూసి గర్వపడుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.

    ఇంకా ఆమె మాట్లాడుతూ ‘కొంతమంది రివ్యూయర్స్ ని చూసి నాకు ఆశ్చర్యం వేసింది. వీళ్లంతా నాలుగు ఫైట్స్, అమ్మాయిల వెంట పడే క్యారెక్టర్స్ ఉన్న సినిమాలకు ఒకప్పుడు భారీ రేటింగ్స్ ఇచ్చారు. అలాంటి వాళ్లకు కంగువా లో పాజిటివ్ అంశాలు కనపడలేదా ?, సెకండ్ హాఫ్ లో వచ్చే అమ్మాయిల ఫైట్ సీక్వెన్స్ గురించి, అలాగే చిన్న పిల్లాడి ట్రాక్ ఎంత అద్భుతంగా ఉంటుంది..దీని గురించి ఒక్క రివ్యూయర్ కూడా రాయలేదు ఎందుకని?, సినిమాల్లో కేవలం నెగేటివ్స్ ని మాత్రమే చూస్తారా?, ఇదంతా చూస్తుంటే ఎవరో సూర్య మీద కక్ష్యతో నెగటివ్ రివ్యూస్ రాయించినట్టు ఉంది. బాగున్న సినిమాకి మొదటి రోజే ఇంత నెగటివిటీ ని చూస్తుంటే నాకు చాలా బాధ కలుగుతుంది’ అంటూ జ్యోతిక ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది. దీనిపై సోషల్ మీడియా లో ఇప్పుడు పలు రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో సూర్య, విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున ఫ్యాన్ వార్స్ చేసుకుంటూ ఉంటారు. విజయ్ ఫ్యాన్స్ కి సంబంధించిన పీఆర్ టీమ్స్ ఇలా కంగువా చిత్రంపై పనిగట్టుకొని నెగటివ్ రివ్యూస్ ఇచ్చారని సూర్య అభిమానులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.