https://oktelugu.com/

Naga Chaitanya, Sai Pallavi’s Love Story : సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ మళ్ళీ పోస్ట్ ఫోన్ !

Naga Chaitanya, Sai Pallavi’s Love Story: కోవిడ్ కేసులు తగ్గాయని, థియేటర్లు ఓపెన్ చేసి సినిమాలు వరుసగా రిలీజ్ చేస్తున్నారు. కానీ మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో థియేటర్లు మళ్ళీ ఎప్పుడు మూత బడతాయో తెలియదు. దీనికితోడు ఇంకా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో నిర్మాతలు తమ సినిమా విడుదల తేదీని ప్రకటించడం, మళ్ళీ రిలీజ్ పోస్ట్ ఫోన్ అయింది అని ప్రకటించడం.. అందరికీ అలవాటు అయిపోయింది. ఈ క్రమంలో […]

Written By: , Updated On : August 28, 2021 / 11:43 AM IST
Follow us on

Love Story Movie Release DateNaga Chaitanya, Sai Pallavi’s Love Story: కోవిడ్ కేసులు తగ్గాయని, థియేటర్లు ఓపెన్ చేసి సినిమాలు వరుసగా రిలీజ్ చేస్తున్నారు. కానీ మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో థియేటర్లు మళ్ళీ ఎప్పుడు మూత బడతాయో తెలియదు. దీనికితోడు ఇంకా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో నిర్మాతలు తమ సినిమా విడుదల తేదీని ప్రకటించడం, మళ్ళీ రిలీజ్ పోస్ట్ ఫోన్ అయింది అని ప్రకటించడం.. అందరికీ అలవాటు అయిపోయింది.

ఈ క్రమంలో ‘లవ్ స్టోరీ’ ( Love Story) సినిమా మళ్ళీ వాయిదా పడింది. అదేంటి సెప్టెంబర్ 10న రిలీజ్ అవుతుందని.. పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మరీ నిర్మాతలు చెప్పారు కదా, పైగా ఈ ప్రెస్ మీట్ పెట్టి వారం కూడా కాలేదు. మరీ అంతలోనే ఏమైంది ? ఎందుకు సినిమాని మళ్ళీ వాయిదా వేస్తున్నారు అంటూ చైతు (Naga Chaitanya) – సాయి పల్లవి (Sai Pallavi) అభిమానులు అడుగుతున్నారు.

అసలు ‘లవ్ స్టోరీ’ సినిమాని సెప్టెంబర్ 10న వస్తోంది కదా, మరి ‘టక్ జగదీష్’ సినిమాని అదే రోజు అమెజాన్ లో ఎలా రిలీజ్ చేస్తారు ? నాని భవిష్యత్తు సినిమాల పై మా ప్రతాపం ఏమిటో చూపిస్తాము అంటూ ప్రెస్ మీట్ లో డిస్ట్రిబ్యూటర్స్ సీరియస్ అయ్యారు. మరి అంతగా ఆవేశపడి, అంత హడావిడి చేసి.. చివరకు రిలీజ్ ను పోస్ట్ ఫోన్ చేయడం నిజంగా విచిత్రమే.

ఒకవిధంగా లవ్ స్టోరీ నిర్మాత సునీల్ నారంగ్ కి ఇది పెద్ద అవమానమే. ఇక హీరో నాని నటించిన ‘టక్ జగదీష్’ మాత్రం సెప్టెంబర్ 10నే వస్తోంది. శేఖర్ కమ్ముల తీసిన ఈ సినిమా ఇప్పటికే జనంలో ఎంతో క్రేజ్ సంపాదించుకొంది. ఏది ఏమైనా టాలీవుడ్ నిర్మాతల పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది, ఈ కరోనా ఇంకా వారిని కలవరపెడుతూనే ఉంది.