Nagarjuna Akkineni: గత ఏడాది నుండి మీడియా కి పెద్ద న్యూస్ ఐటెం గా మారిన అంశం సమంత మరియు నాగ చైతన్య విడాకుల వ్యవహారం..వీళ్లిద్దరు విడిపోయిన విషయం వారి కుటుంబ సభ్యులు కూడా మర్చిపోయి ఉండొచ్చేమో కానీ మీడియా మాత్రం మర్చిపోలేదు..రోజు వీళ్లిద్దరికీ సంబంధించిన ఎదో ఒక వార్త ప్రచారం చేస్తూనే ఉంటుంది.
Nagarjuna Akkineni, naga chaitanya
అంతతి క్రేజీ కపుల్ అన్నమాట..అయితే సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య ఆమె గురించి ఎవరైనా మీడియా వ్యక్తి అడిగినప్పుడు ఇప్పటికి పాజిటివ్ గా చెప్తున్నాడు..కానీ సమంత మాత్రం నాగ చైతన్య మీద పీకలదాకా కోపం పెట్టుకొని ఉంది..ఈ విషయం ఆమె ఇటీవల బాలీవుడ్ లో పాల్గొన్న ‘కాఫీ విత్ కరణ్’ అనే ప్రోగ్రాం చూస్తే అర్థం అవుతుంది..ఇందులో సమంత ని నాగచైతన్య గురించి అడిగినప్పుడు సమంత ఇచ్చిన సమాదానాలు సోషల్ మీడియా లో ఇప్పటికి ట్రెండ్ అవుతూనే ఉంది..వీళ్లిద్దరి మధ్య ఏమి లేకపోతేనే కొత్త కథనాలు పుట్టించే మీడియా కి ఇప్పుడు సమంత అంత స్టఫ్ ఇచ్చాక ఎలా ఊరుకుంటుంది..కథనాలు మీద కథనాలు రాసేస్తారు కదా..అయితే వీళ్లిద్దరి విడాకుల వ్యవహారం గురించి ఇప్పుడు అక్కినేని నాగార్జున కూడా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇటీవలే ఆయన సొసైల్ మీడియా లో అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు..అభిమానుల నుండి ఎక్కువగా నాగార్జున తదుపరి చిత్రం ఘోస్ట్ సినిమాకంటే కూడా సమంత మరియు నాగ చైతన్య విడాకుల వ్యవహారం గురించే ప్రశ్నలు వచ్చాయి..ఇక నాగార్జున కూడా స్పందించక తప్పలేదు..ఆయన మాట్లాడుతూ ‘విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య ఇప్పుడు చాలా సంతోషం గా ఉన్నాడు..వాడిని అంత సంతోషం గా చూస్తుంటే నాకు చాలా అనందం గా ఉంది..సమంత అంటే కాదు నాకు చాలా ఇష్టం..వాళ్లిదరు విడిపోవడం ని గుర్తు చేసుకుంటే నాకు ఇప్పటికి బాధ వేస్తూనే ఉంది..కానీ జరగాల్సింది జరిగిపోయింది కాబట్టి వాటి గురించి నేను ఇక మాట్లాడి సమయం వృధా చెయ్యను.
Nagarjuna Akkineni, naga chaitanya
మీరు కూడా మీకు అనవసరమైన విషయాలను పట్టించుకోవడం మానేస్తే సుఖం గా ఉంటారు’ అంటూ సమాధానం ఇచ్చాడు నాగార్జున..ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఇక నాగార్జున గారు ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆయన హీరో గా నటించిన ఘోస్ట్ సినిమా వచ్చే నెల 5 వ తారీఖున దసరా కానుకగా విడుదల కానుంది..ఈ సినిమా కి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ రావడం తో అక్కినేని అభిమానులు ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు..మరి వారి అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది చూడాలి.