Naga Chaitanya: తెలుగు రాష్ట్రాల్లో కల్కి 2829 AD(Kalki 2829AD) ఫీవర్ నడుస్తుంది. భారీ బడ్జెట్ మూవీ కావడంతో అదే స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేదికపై బుజ్జిని పరిచయం చేశారు. కల్కి మూవీలో ప్రభాస్(Prabhas) వాహనం పేరు బుజ్జి. ఈ మూడు చక్రాల ఫ్యూచరిస్టిక్ కారులో ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. కథలో ఈ కారుకు ఎంతటి ప్రాధాన్యత ఉందో తెలియదు కానీ… ఓ రేంజ్ లో హైప్ ఇస్తున్నారు.
ఇక బుజ్జి కారు ప్రోమో కూడా అదిరింది. కాగా ఈ కారును ప్రత్యేకంగా రూపొందించారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను(Anand Mahindra) దర్శకుడు గతంలో సాంకేతికంగా సహాయం అందించాలని కోరాడు. అందుకు ఆనంద్ మహీంద్రా అంగీకారం తెలిపారు. మహీంద్రా అండ్ జయీమ్ ఆటోమోటివ్స్ సంస్థలు సంయుక్తంగా బుజ్జిని తయారు చేశాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బుజ్జి కారును నిర్మించడం జరిగింది. కాగా ఈ బుజ్జి కారును నడిపిన నాగ చైతన్య షాక్ కి గురయ్యాడు.
నాగ చైతన్య తో పాటు కల్కి టీమ్ స్పెషల్ డ్రైవ్ కోసం ఓ ప్లేస్ కి వెళ్లారు. నిర్మానుష్యమైన రోడ్ లో నాగ చైతన్య బుజ్జిని డ్రైవ్ చేశాడు. సాంకేతిక నియమాలను బ్రేక్ చేశారని, నేను ఇంకా షాక్ లోనే ఉన్నానని నాగ చైతన్య అన్నాడు. ప్రభాస్ బుజ్జిని డ్రైవ్ చేసిన నాగ చైతన్య వీడియో వైరల్ అవుతుంది. కాగా జూన్ 27న కల్కి విడుదల అవుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కల్కి చిత్రాన్ని తెరకెక్కించారు. అశ్వినీ దత్ నిర్మాతగా ఉన్నారు. కల్కి బడ్జెట్ దాదాపు రూ. 500 కోట్లు.
ప్రమోషన్స్ కి మరో వంద కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని సమాచారం. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. దిశా పటాని సెకండ్ హీరోయిన్ గా చేస్తుంది. అమితాబ్ కీలక పాత్రలో అలరించనున్నారు. కల్కి ప్రాజెక్ట్ లో కమల్ హాసన్ జాయిన్ కావడం ఊహించని పరిణామం. ఆయన పాత్ర ఏమిటనేది ఇంకా తెలియదు. సర్ప్రైజ్ కోసం అలా దాచి ఉంచారు. కల్కి సైతం రెండు భాగాలుగా విడుదల కానుందని సమాచారం.
This was nothing like I’ve ever imagined .. hats off to the entire team for translating this vision into reality .. truly an engineering marvel . Had a great time chilling with Bujji . https://t.co/fmwCJPsLCl
— chaitanya akkineni (@chay_akkineni) May 25, 2024