Producer Bunny Vasu : నాగ చైతన్య జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన రెండో వివాహం చేసుకోబోతున్నాడు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఆయనకు నిశ్చితార్థం జరిగింది. ఆగస్టు 8వ తేదీన నాగార్జున నివాసంలో ఈ వేడుక జరిగింది. నిరాడంబరంగా ఇరు కుటుంబాల సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ నిర్వహించారు. ఇలా హడావుడిగా ఎంగేజ్మెంట్ చేయడానికి ముహూర్తం కారణం అని నాగార్జున క్లారిటీ ఇచ్చారు . అంత మంచి ముహూర్తం కోల్పోకూడదనే హడావుడిగా వేడుక చేయాల్సి వచ్చింది అన్నారు.
కొత్త కోడలు శోభితకు నాగార్జున తమ ఫ్యామిలీలోకి ఆహ్వానం పలికారు. కొన్నాళ్లుగా శోభితతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నాడు. ఇక నాగ చైతన్య-శోభితల వివాహం వచ్చే ఏడాది జరగనుందట. ఫిబ్రవరి లేక మార్చి నెలలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. కాగా నాగ చైతన్యను ఉద్దేశిస్తూ స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
నాగ చైతన్య ప్రస్తుతం నాగార్జున కొడుకులా ఫీల్ కావడం లేదట. అన్ని వదిలేసుకున్నాడట. ఏదో సాధించాలనే తపనలో ఉన్నాడట. ఒక సాధారణ వ్యక్తిలా భావిస్తున్నాడట. నాగ చైతన్యలో ఈ మార్పుకు కారణం… ఆయన తండేల్ మూవీలో చేస్తున్న పాత్ర అట. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న తండేల్ మూవీలో నాగ చైతన్య జాలరి పాత్ర చేస్తున్నాడు. బోటు నడిపేవాడిగా ఆయన కనిపిస్తాడట.
తండేల్ లో నాగ చైతన్య పాత్ర పేరు రాజు అట. ఒక పేద కుర్రాడిలా సహజంగా కనిపించేందుకు.. ప్రేక్షకులను ఒప్పించేందుకు అలా మారిపోయాడట. తాను ఓ బడా హీరో నాగార్జున కొడుకు అనే భావన వదిలేశాడట. ఒక సాధారణ జాలరి కుటుంబంలో పుడితే ఎలా ఉంటాడో.. అలానే ఉండాలి అనుకుంటున్నాడట. నాగ చైతన్య పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడని బన్నీ వాసు పరోక్షంగా తెలియజేశాడన్న మాట.
తండేల్ విజయం నాగ చైతన్యకు చాలా అవసరం. లవ్ స్టోరీ అనంతరం నాగ చైతన్యకు హిట్ లేదు. ఆయన నటించిన థాంక్యూ, కస్టడీ డిజాస్టర్ అయ్యాయి. ఒక సాలిడ్ హిట్ తో కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. తండేల్ మూవీలో సాయి పల్లవి హీరోయిన్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు, అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఎమోషనల్ లవ్ డ్రామాగా గా తండేల్ తెరకెక్కుతుంది.