Homeఎంటర్టైన్మెంట్Naga Chaitanya: తెలుగు హీరోయిన్ ప్రేమలో నాగ చైతన్య? ... ఆమెతో చెట్టాపట్టాల్!

Naga Chaitanya: తెలుగు హీరోయిన్ ప్రేమలో నాగ చైతన్య? … ఆమెతో చెట్టాపట్టాల్!

Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య తెలుగు హీరోయిన్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. సదరు హీరోయిన్ బర్త్ డే వేడుకలు స్వయంగా నిర్వహించిన నాగ చైతన్య, హైదరాబాద్ లో నిర్మించుకుంటున్న తన డ్రీం హౌస్ కి ఆమెను తీసుకెళ్లారట. ఆమెతో రెండో పెళ్ళికి నాగ చైతన్య సిద్దమవుతున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. దాదాపు ఏడాది కాలంగా నాగ చైతన్య ఒంటరి జీవితం అనుభవిస్తున్నారు. 2021 అక్టోబర్ నెలలో హీరోయిన్ సమంతతో విడాకులు తీసుకున్నారు. ప్రకటనకు ముందే కొన్ని నెలలుగా వారు విడిగా ఉన్నారు. ఇక సమంత, నాగచైతన్య ఎందుకు విడిపోయారనే విషయంపై అనేక పుకార్లు ప్రచారంలో ఉన్నాయి.

Naga Chaitanya
Naga Chaitanya, Sobhita Dhulipalla

విడాకుల ప్రకటన తర్వాత ఇద్దరూ ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు. 35 ఏళ్ల నాగ చైతన్య మరలా ప్రేమలో పడ్డారనేది తాజా వార్త. తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఆయన ప్రేమాయణం సాగిస్తున్నారట. కొద్దిరోజులుగా వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారట. మే 31న శోభిత దూళిపాళ్ల బర్త్ డే కాగా ఓ హోటల్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ పార్టీలో నాగ చైతన్య పాల్గొన్నారట. ఇక హైదరాబాద్ లో నాగ చైతన్య కోట్ల రూపాయలతో తన డ్రీం హౌస్ నిర్మించుకుంటున్నారు. నిర్మాణంలో ఉన్న ఆ ఇంటికి శోభితను ప్రత్యేకంగా తీసుకెళ్లారట.

Also Read: AP Online Ticket Issue: చిత్ర పరిశ్రమపై కత్తికట్టిన ఏపీ సర్కారు.. కారణం అదేనా?

Naga Chaitanya
Naga Chaitanya, Sobhita Dhulipalla

వీళ్ళ మధ్య ఘాడమైన ప్రేమ మొదలైందని టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కొచ్చు అంటున్నారు. ఇక గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శోభిత దూళిపాళ్ల నటి కావాలనే ఆశతో ముంబై వెళ్లారు. 2016లో విడుదలైన రామన్ రాఘవ్ 2.0 హిందీ చిత్రంతో శోభిత చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. 2018 లో విడుదలైన గూఢచారి మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అడివి శేష్ హీరోగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అలాగే అడివి శేష్ లేటెస్ట్ రిలీజ్ మేజర్ మూవీలో సైతం ఆమె నటించారు. ప్రస్తుతం శోభిత దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వం మూవీలో నటిస్తున్నారు. అలాగే ఓ హిందీ చిత్రంతో పాటు మంకీ మాన్ అనే హాలీవుడ్ మూవీలో నటిస్తున్నారు.

Also Read:Senior Hero Naresh: ఆ ప్రముఖ నటితోనే సహజీవనం చేస్తున్న నరేశ్ వీడియో వైరల్.. నాలుగో పెళ్లి ఎప్పుడంటే?

Recommended Videos:

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular