https://oktelugu.com/

Custody Movie Review: నాగ చైతన్య ‘కస్టడీ’ మూవీ ఫుల్ రివ్యూ

డైరెక్టర్ వెంకట్ ప్రభు ఎప్పటిలాగానే ఒక ఆసక్తికరమైన పాయింట్ ని పట్టుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేసాడు.కానీ ఆయన స్క్రీన్ ప్లే విషయం లో ఎందుకో ఈ సినిమా విషయం లో కాస్త తడబడ్డాడు అని అనిపిస్తుంది. సినిమాలో వచ్చే చేసింగ్ సన్నివేశాలు ఆడియన్స్ సహనాన్ని పరీక్షిస్తాయి.అందుకు కారణం ప్రొడక్షన్ విలువలు ఏమాత్రం కూడా లేకపోవడమే.

Written By:
  • Vicky
  • , Updated On : May 12, 2023 / 10:37 AM IST

    Custody Movie Review

    Follow us on

    Custody Movie Review: నటీనటులు : అక్కినేని నాగ చైతన్య , కృతి శెట్టి, అరవింద స్వామి, శరత్ కుమార్ , వెన్నెల కిషోర్ తదితరులు.

    సంగీతం : యువన్ శంకర్ రాజా , ఇళయ రాజా
    దర్శకత్వం : వెంకట్ ప్రభు
    నిర్మాత : శ్రీనివాస చిట్టూరి

    వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న అక్కినేని నాగ చైతన్య కెరీర్ కి స్పీడ్ బ్రేకర్ లాగ నిల్చిన చిత్రం ‘థాంక్యూ’. ఈ సినిమా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది, కనీసం నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేక పోయింది ఈ చిత్రం. అంత పెద్ద డిజాస్టర్ తర్వాత నాగ చైతన్య తమిళ టాప్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తో కలిసి ‘కస్టడీ’ అనే చిత్రం మొదలు పెట్టాడు. వెంకట్ ప్రభు రీసెంట్ గా ‘మానాడు’ వంటి సూపర్ హిట్ తో మంచి ఊపు మీద ఉన్నాడు. కాబట్టి అక్కినేని ఫ్యాన్స్ లో ఈ చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.అంచనాలకు తగ్గట్టుగానే టీజర్ మరియు ట్రైలర్ కూడా ఆకట్టుకుంది.మరి ఈరోజు గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా లేదా అనేది చూద్దాము.

    కథ :

    శివ ( నాగ చైతన్య) ఒక నిజాయితీ గల కానిస్టేబుల్. చట్టం లోని ప్రతీ అంశాన్ని నిక్కచ్చిగా అనుసరించాలి అని అనుకునే వ్యక్తి ఆయన. తాను డ్యూటీ లో ఉన్నప్పుడు ఒక్క తప్పు కూడా జరగకూడదు అని అనుకుంటాడు. అలాగే తన వ్యక్తిగత జీవితం లో రేవతి ( కృతి శెట్టి ) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆమెని పెళ్లి చేసుకొని ప్రశాంతంగా బ్రతకాలని అనుకుంటాడు. అయితే ఒక రోజు డ్యూటీ లో ఉన్నప్పుడు సఖినేటి పల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్న క్రిమినల్ రాజన్న (అరవింద్ స్వామి) ని చంపబోతున్నారు అనే విషయం శివ కి తెలుస్తుంది. ఇది చట్టరీత్య నేరం అని తెలుసుకున్న శివ అతనిని తీసుకొని కోర్టు లో హాజరు పర్చాలని అనుకుంటాడు. ఈలోపు తన ప్రేయసి రేవతి కి ఇంట్లో పెళ్లి చెయ్యాలని చూస్తారు. ఆ సమయం లో రాజన్న తో పాటుగా రేవతి ని కూడా తన తో పాటు తీసుకెళ్తాడు శివ. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

    విశ్లేషణ :

    డైరెక్టర్ వెంకట్ ప్రభు ఎప్పటిలాగానే ఒక ఆసక్తికరమైన పాయింట్ ని పట్టుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేసాడు.కానీ ఆయన స్క్రీన్ ప్లే విషయం లో ఎందుకో ఈ సినిమా విషయం లో కాస్త తడబడ్డాడు అని అనిపిస్తుంది. సినిమాలో వచ్చే చేసింగ్ సన్నివేశాలు ఆడియన్స్ సహనాన్ని పరీక్షిస్తాయి.అందుకు కారణం ప్రొడక్షన్ విలువలు ఏమాత్రం కూడా లేకపోవడమే.నిర్మాత ఖర్చు కి బాగా వెనుకాడడు అనే విషయం అర్థం అవుతుంది ఈ సినిమా చూసిన తర్వాత.ప్రారంభం మొత్తం స్లో గా ఉన్నప్పటికీ, అరవింద స్వామి మరియు శరత్ కుమార్ ఎంట్రీ తో కాస్త వేగం పుంజుకుంటుంది.సెకండ్ హాఫ్ కి మంచి ఇంటర్వెల్ కి కూడా సెట్ చేసాడు వెంకట్ ప్రభు. కానీ సెకండ్ హాఫ్ మొత్తం రొటీన్ సన్నివేశాలతో ఆడియన్స్ కి చిరాకు రప్పించాడు.

    ఇక నటీనటుల విషయానికి వస్తే నాగ చైతన్య శివ పాత్రలో చాలా చక్కగా నటించాడు, ఎప్పటి నుండో ఆయన మాస్ హీరో అనిపించుకునే ప్రయత్నాలు చేసాడు కానీ, ఇందులో మాత్రం అవి ఫలించాయి.ఇక అరవింద స్వామి గురించి ప్రత్యేకించి చెప్పేది ఏమి ఉంది, ధ్రువ సినిమాతోనే తన విలనిజం ఎలా ఉంటుందో చూపించాడు, ఇందులో కూడా అదే రేంజ్ లో నటించాడు. శరత్ కుమార్ పాత్ర కూడా బాగుంది. ఇక హీరోయిన్ కృతి శెట్టి కి ‘ఉప్పెన’ తర్వాత నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్ర ఈ సినిమాలోనే పడింది అని చెప్పాలి.ఇక ఈ చిత్రానికి పెద్ద మైనస్ ఏదైనా ఉందా అంటే అది మ్యూజిక్. యువన్ శంకర్ రాజా మరియు ఇళయ రాజా ఇద్దరు ఈ సినిమా కోసం పని చేసారు. ఒక్క పాట బాగారాలేదు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదే రేంజ్ లో ఉంది.వీళ్లిద్దరి నుండి ఇలాంటి ఔట్పుట్ మాత్రం ఎవ్వరూ ఊహించి ఉండరు.

    చివరి మాట :

    వెంకట్ ప్రభు రేంజ్ సినిమా అయితే కాదు కానీ,యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ని నచ్చే ప్రేక్షకులు ఒకేసారి చూడొచ్చు.

    రేటింగ్ : 2.5/5