Naga Chaitanya: సమంత, నాగచైతన్య విడిపోయి ఇప్పటికే రెండు నెలలు అయింది. అయినా సోషల్ మీడియాలో అలాగే రెగ్యులర్ మీడియాలో ఈ అంశంపై జరుగుతున్న చర్చ, కాదు కాదు రచ్చ అదుపు తప్పుతూనే ఉంది. సమంత క్యారెక్టర్ లో లోపాలు ఉన్నాయి కాబట్టే.. చైతు ఆమెను దూరం పెట్టాడు అని ఇలా చాలా రకాల పుకార్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే, నాగచైతన్య గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

వైరల్ కావడానికి కారణం.. ఆ వీడియోలో చైతు చేసిన కామెంట్స్ సామ్ ను దృష్టిలో పెట్టుకునే అని అనిపిస్తుంది. కాకపోతే చైతు పరోక్షంగా సామ్‌ను ఉద్దేశించి మాట్లాడాడు అని నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ చైతు ఏమి మాట్లాడాడు అంటే.. ముందుగా యాంకర్ ఓ ప్రశ్న అడుగుతూ.. ‘మీరు ఏ పాత్రలు చేయడానికి ఇష్టపడరు’ అంటూ ప్రశ్న అడిగింది.
యాంకర్ అడిగిన ఆ ప్రశ్నకు చైతు సమాధానం ఇస్తూ.. ‘నేను ఏ పాత్ర చేయడానికైనా రెడీ ఉంటాను. కాకపోతే, నా ఫ్యామిలీ పై పర్సనల్‌గా ఎఫెక్ట్ చూపే పాత్రలను గానీ, అలాంటి కథలను గాని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చేయను” అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చాడు. చైతు చేసిన ఈ కామెంట్స్ ను పరిశీలిస్తే.. చైతు మనసు ఎలాంటిదో, ఫ్యామిలీ గౌరవానికి ఎంతగా ప్రాముఖ్యత ఇస్తాడో అర్థం చేసుకోవచ్చు.
అయితే, సమంత అందాల ఆరబోతలు, ఇక ఆమె బోల్డ్ కామెంట్స్ మొత్తానికి చైతును బాధ పెట్టాయి. అందుకే, సమంతను ఉద్దేశించే చైతు అప్పుడు ఇన్ డైరెక్ట్‌గా కామెంట్స్ చేసి ఉంటాడని.. పలువురు నెటిజన్లు ఫీల్ అవుతున్నారు. ఏది ఏమైనా సమంత, నాగచైతన్య విడాకుల ప్రకటన తర్వాత సామ్ పై అనేక నెగటివ్ రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇంకా అవుతూనే ఉన్నాయి.
Also Read: Shyam Singha Roy: మనమే విజేతలం అంటే ఎలా నాని ?
అయినా ఒక జంట మధ్యన బయట ప్రపంచానికి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. పైకి అంత బాగుందనిపిస్తుంది, కానీ లోపల తెలియని చాలా సమస్యలు. ఇలాంటి సమయంలోనే జీవిత భాగస్వామిని సరిగ్గా అర్థం చేసుకుని జీవితాన్ని మొదలు పెట్టాలి. అసలు ఒకరి కోసం ఒకరు మారితే ఏ సమస్య ఉండదు, కానీ సమస్యలు ఎక్కువైతే విడాకుల వైపే ప్రయాణం కొనసాగుతుంది.
Also Read: Katrina Kaif: పెళ్లి తర్వాత మొదటిసారి మీడియా ముందుకు కత్రీనా – విక్కీ…
Nee clarity @chay_akkineni 👌👌 pic.twitter.com/LAXv1T6AMz
— RishiQ (@risheek_king) December 10, 2021