
`గీత గోవిందం’ ఘన విజయం తో దర్శకుడు పరశురామ్ కి పలు ఆఫర్స్ వచ్చాయి. వాటిలో రెండు సినిమాలను మాత్రమే పరశురామ్ ఒకే చేయడం జరిగింది. అందులో మొదటిది నాగ చైతన్య హీరోగా నటించే చిత్రం కాగా, రెండోది మహేష్ బాబు హీరోగా నటించే చిత్రం. నిజానికి పరశురామ్ నాగ చైతన్య చిత్రం మొదలు పెట్టాల్సి ఉంది. అయితే ఊహించని విధంగా మహేష్ బాబు నుండి పిలుపు రావడం తో నాగ చైతన్య చిత్రాన్ని పక్కన పెట్టడం జరిగింది. ఈనెల 31న కృష్ణ పుట్టినరోజు కానుకగా మహేష్ బాబు చిత్రం యొక్క అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా ఈ చిత్రం లో మహేష్ బాబు రేంజ్ కి తగ్గట్టుగా అన్ని అంశాలు ఉంటాయని దర్శకుడు పరశురామ్ చెప్పడం జరిగింది .ఇదొక అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని కూడా చెప్పడం జరిగింది .
ఒక్కరి నుండి 100 మందికి సోకిన కరోనా వైరస్
ఇక పరుశురాం దర్శకత్వంలో నాగ చైతన్య హీరో గా మూవీ ఉండదని అంతా అనుకొన్నారు. ఇదే విషయం దర్శకుడు పరుశురాం ని అడిగితే.. నాగ చైతన్య చిత్రం ఆగిపోలేదు , మహేష్ బాబు మూవీ అనంతరం నేను చేయ బోయే సినిమా అదే అని స్పష్టత ఇచ్చాడు.