https://oktelugu.com/

Nagarjuna: నాగార్జునకు పిచ్చి పట్టింది అనుకున్న చైతన్య, అఖిల్, అమల?

కొత్త డైరెక్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన ఆదరణ సొంతం చేసకున్న విషయం తెలిసిందే. అయితే సినిమా గురించి నాగార్జున ఏమన్నారంటే.. ముందుగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 29, 2024 / 01:04 PM IST
    Follow us on

    Nagarjuna: సంక్రాంతి బరిలో బడా హీరోలు పోటీకి దిగిన సంగతి తెలిసిందే. ఈ పండుగ కానుకగా నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబులు పోటీ పడ్డారు. ఇందులో నాగార్జున నటించిన నా సామిరంగా సినిమా కూడా మంచి ఫలితాలను సొంతం చేసుకుంది. గుంటూరు కారం, సైంధవ్ సినిమాలు యావరేజ్ టాక్ ను సొంతం చేసుకోగా నా సామిరంగా సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది. అయితే ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను అరేంజ్ చేసింది. అందులో భాగంగా నాగార్జున చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

    కొత్త డైరెక్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన ఆదరణ సొంతం చేసకున్న విషయం తెలిసిందే. అయితే సినిమా గురించి నాగార్జున ఏమన్నారంటే.. ముందుగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 20వ తేదీ నాన్న గారి జయంతి. ఆ రోజున అన్నపూర్ణ స్టూడియో లో నాన్నగారి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగిందని తెలిపారు. ఆ రోజు నా సామి రంగా సినిమాను లాంచ్ చేసామన్నారు. ఒక వైపు విగ్రహావిష్కరణ జరుగుతుండగా మరోవైపు ఆ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయన్నారు. అయితే పూజా కార్యక్రమానికి వెళ్తుంటే అమల ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగిందట.

    అప్పటి వరకు ఈ సినిమాకు కమిట్ అయిన విషయం కుటుంబ సభ్యులకు తెలియదట. అదే సమయంలో సినిమా లాంచ్ కు వెళ్లాలి అని చెబితే.. ఇప్పుడు అవసరమా కాస్త ఆలస్యంగా వెళ్లండని చెప్పారట. లేదు ఈ సినిమాను సంక్రాంతికి లాంచ్ చేయాలి అని చెప్పగానే. అమలతో పాటు నాగచైతన్య, అఖిల్ కూడా నీకేమైనా పిచ్చి పట్టిందా అనే విధంగా చూశారని తెలిపారు. ఇంత తక్కువ సమయంలో సినిమాను ఎలా విడుదల చేస్తారంటూ ఆశ్చర్యపోయారట.

    ఎవరు నమ్మకపోయినా కూడా సినిమా టీమ్ మాత్రం నమ్మిందట. ప్రతి ఒక్కరు కూడా నవ్వుతూనే అతి తక్కువ సమయంలో సినిమాను కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారని తెలిపారు నాగార్జున. కానీ మొత్తంగా చాలా తక్కువ సమయంలో సినిమాను పూర్తి చేసి మంచి సక్సెస్ అందుకోవడంతో అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.